NTV Telugu Site icon

మంగళగిరిలో పట్టుబడ్డ 50 కిలోల గంజాయి..

ఏపీలో గంజాయి పట్టివేత నిత్యకృత్యంగా మారింది. ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడోచోట భారీగా గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజా మంగళగిరిలో మరోసారి గంజాయి రవాణా తతంగం బయట పడింది. మంగళగిరిలోని కాజా టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు తనఖీ చేస్తుండగా ఓ కారులో 50 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు.

దీంతో డ్రైవర్‌ కారును వదిలి పరారయ్యాడు. విశాఖ నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తున్నారనే అనుమానం పోలీసులు వ్యక్తం చేశారు. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు. ఏపీలో మాదకద్రవ్యాల రవాణా జోరుగా సాగుతోందని వార్తలు వస్తుండడంతో పోలసులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు.