Site icon NTV Telugu

Kidney Stones: కిడ్నీనా, రాళ్ల గనినా.. ఏకంగా 3 వేల రాళ్లు

3000 Kidney Stones

3000 Kidney Stones

3000 Stones Removed From Kidney In AP Man: అన్నమయ్య జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. మదనపల్లె మండలానికి చెందిన ఓ వృద్దుడి కిడ్నీలో మూడు వేల రాళ్లు బయటపడ్డాయి. వృద్దుడిని ఆస్పత్రికి తరలించి అందులో ఉన్న రాళ్లను సర్జరీ చేసి తొలగించినట్లు యూరాలజీ డాక్టర్ వివరించారు. మదనపల్లెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స జరిగింది. కుట్లు అవసరం లేకుండా కీహోల్ సర్జరీ ద్వారా ఆ రాళ్లను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో రాళ్లు బయటపడటం అరుదని డాక్టర్లు వ్యాఖ్యనించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది.. త్వరగానే కోలుకుంటారని డాక్టర్లు వెల్లడించారు.

Naveen murder case: కత్తిని ముందే లవర్‌కు చూపిన హరిహరకృష్ణ.. నవీన్‌ శరీరబాగాలను హసన్ ఇంట్లో..

మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పులు.. కరోనా తర్వాత పరిస్థితులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆహారపు అలవాట్లు.. వ్యాయామం లేకపోవడం.. నిరంతరం ఒత్తిడి.. తగినంత నిద్రలేకపోవడంతో.. దీర్ఘకాలిక వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయని వైద్యులు పెర్కొన్నారు. ప్రస్తుతం కల్తీ పుడ్ తినడంతో పాటు.. కలుషిత నీరు.. అవగాహన లోపంతో మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. అధిక రక్తపోటు.. మధుమేహం.. నొప్పుల నివారణకు అధిర మోతాదులో తరచూ మందులు వాడటం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Somu Veerraju: ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది

Exit mobile version