2020లో ప్రారంభమైన కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా లాక్‌డౌన్ తర్వాత విజయవాడలో రోడ్డుప్రమాదాలు పెరిగాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా 28 బ్లాక్ స్పాట్స్‌ను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్‌పై ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న 18 మందిపై కేసులు నమోదు చేశారు.గొల్లపూడి నుండి ఇబ్రహీంపట్నం వెళ్లే హైవేపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 613 యాక్సిడెంట్స్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయా ప్రమాదాల్లో 149 మంది స్పాట్ డెడ్ అయ్యారని.. కళ్ళు, చేతులు పోగొట్టుకుని తీవ్ర గాయాలు ప్రాణాలతో 175 మంది బయటపడ్డారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి 15 రోజులుగా నగర ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇప్పటివరకు 630 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేశారు. అందులో 286 మందికి జైలు శిక్ష పడింది.
ఈ ఏడాది ఇప్పటి వరకు 4,289 ట్రిపుల్ రైడింగ్ కేసులు నమోదయ్యాయి. కాగా రోడ్లపై ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తే ఊరుకునేది లేదని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.