Site icon NTV Telugu

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్… తగ్గనున్న ఛార్జీలు

పండుగ సమయాల్లో 50 శాతానికి పైగా ఛార్జీలు వసూలు చేసే ఏపీ ఎస్ ఆర్టీసీ అధికారులకు అన్ సీజన్లో ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. విజయవాడ – హైదరాబాద్‌ మధ్య తిరిగే వివిధ బస్సులకు ఛార్జీలు తగ్గించారు. విజయవాడ- హైదరాబాద్ మధ్య ఛార్జీలు తగ్గించాలని నిర్ణయించారు. ఇంద్ర, అమరావతి, గరుడ, నైట్ రైడర్, వెన్నెల స్లీపర్ బస్సుల్లో 20 శాతం వరకు ఛార్జీలు తగ్గిస్తామని ఆర్‌ఎం యేసు దానం తెలిపారు.

విజయవాడ మీదుగా హైదరాబాద్‌ వెళ్లేవారు ఆదివారం. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళవారు శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఈ రాయితీ పొందవచ్చు. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, ఆటోనగర్ డిపోల బస్సుల్లో ప్రయాణించేవారికి ఈ రాయితీ వర్తించనుంది. ఈ రాయితీ ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గుడివాడ నుండి బీహెచ్ఈల్‌కు ఇంద్ర బస్సులో ఛార్జీ రూ.610 వుండగా రాయితీ వర్తించడం వల్ల ఆ ఛార్జీ రూ.555 కు తగ్గనుంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు అమరావతి బస్సు ఛార్జీ ప్రస్తుతం రూ.650 కాగా రాయితీ ద్వారా కేవలం రూ.535కి ప్రయాణించవచ్చు. గరుడ బస్సు టికెట్ రూ.620 వుండగా.. రాయితో రూ.495కు లభిస్తుంది. వెన్నెల స్లీపర్‌ బస్సుకు రూ.730 వసూలు చేస్తుండగా దాని ధర రూ.590కి తగ్గుతుంది.

Exit mobile version