ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడి కోసం కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగనుంది.. ఈ నెల 5వ తేదీన ఏపీలో కర్ఫ్యూ ప్రారంభించగా.. కొత్త కేసులు కంట్రోల్ కాకపోవడంతో.. కర్ఫ్యూను మరింత టైట్ గా అమలు చేస్తున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కేసుల తీవ్రతను బట్టి లాక్‌డౌన్ కూడా అమలు చేస్తున్నారు.. తాజాగా, కరోనా కేసుల కట్టడికి అనంతపురం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది… జిల్లా వ్యాప్తంగా 48 గంటల పాటు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయానికి వచ్చారు.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు స్వచ్ఛంధగా దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు.. ఈ సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.
కరోనా ఎఫెక్ట్.. ఏపీలోని ఆ జిల్లాలో 2 రోజులు సంపూర్ణ లాక్‌డౌన్
anantapur