AP Police SI Recruitment 2022-23: ఎస్ఐ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ.. ఒకటికి 421 మంది పోటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Police SI Recruitment 2022-23: ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన ఏ నోటిఫికేషన్ వెలువడినా.. లక్షలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు.. ఉద్యోగం చిన్నదా? పెద్దదా? అనే తేడా లేకుండా.. చివరకు అటెండర్ పోస్టులు పడినా.. ఉన్నత చదువులు చదివిన వారు కూడా పోటీ పడుతున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు కొలువులకు గట్టి పోటీ నెలకొంది.. అది ఎంతలా అంటే.. ఒక్కో పోస్టుకు 421 మంది పోటీ పడేలా.. ఎస్ఐ పోస్టులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే గడువు జనవరి 18వ తేదీతో ముగిసింది.. ఆ సమయానికి 1,73,047 మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.. వీరిలో పురుష అభ్యర్థులు 1,40,453 మంది, మహిళా అభ్యర్థులు 32,594గా ఉన్నారు..
Read Also: Villagers attack on police: జల్లికట్టులో యువకుడు మృతి.. పోలీసులపై గ్రామస్తుల దాడి, టెన్షన్
Also Read
అయితే, పోలీసు శాఖలో కేవలం 411 (సివిల్ పోలీసు-315, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్-96) పోస్టుల భర్తీకి మాత్రమే పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.. 2022 నవంబరు 28న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా డిసెంబరు 14 నుంచి 2023 జనవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు.. ఇక, అభ్యర్థులకు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు జారీ చేయనున్నారు.. ఫిబ్రవరి 19న ప్రాథమిక పరీక్ష జరగనుంది.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది.
తాజావార్తలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్‌కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!