NTV Telugu Site icon

Government Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మరో 1,610 పోస్టుల భర్తీ..!

Ap Medical Department

Ap Medical Department

Government Jobs: నిరుద్యోగులకు మరోసారి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇప్పటికే పలు శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తుండగా.. ఇప్పుడు వైద్య శాఖలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1,610 పోస్టుల భర్తీకి సిద్ధమైంది.. ఆ శాఖలో కొత్తగా 1,610 పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్‌.. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం ఫ్యామిలి డాక్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే కాగా.. అందులో భాగంగా.. ఈ పోస్టులను క్రియేట్‌ చేసింది.

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

మొత్తం 1,610 కొత్త పోస్టుల్లో 88 పీహెచ్‌సీల కోసం 1,232 పోస్టులను కేటాయించింది ఏపీ ప్రభుత్వం.. ఇక, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ ఉన్న 63 మండలాల్లో సీహెచ్‌సీ కేంద్రంగా వైద్యులు, వైద్య సిబ్బందితో ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలు చేసేందుకు 378 పోస్టులను కేటాయించినట్టు పేర్కొంది.. కొత్త పోస్టుల్లో 302 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, 264 స్టాఫ్‌ నర్స్, 151 ఎంపీహెచ్‌ఈవో/సీహెచ్‌వో, ఇతర పోస్టులు ఉండబోతున్నాయి.. కొత్తగా భర్తీ చేసే పోస్టులతో వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయన్న నమ్మకంతో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరోవైపు.. ఇప్పటికే వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం పూనుకున్న విషయం విదితమే.