NTV Telugu Site icon

Konaseema: కోనసీమలో నేటి నుంచి సెక్షన్ 144 అమలు..

Police

Police

కోనసీమ జిల్లా ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు సెక్షన్ 144 అమలు చేస్తున్నట్టు ప్రకటించారు ఎస్పీ సుబ్బారెడ్డి… కోనసీమలోని అమలాపురం, పి గన్నవరం నియోజకవర్గాలతో పాటు కొత్తపేట, కాట్రేనికొన, రావులపాలెం మండలాల్లో సెక్షన్ 144 విధించినట్టు వెల్లడించారు.. సెక్షన్ 144 అమలులో ఉన్న కారణంగా ఎటువంటి ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.. కోనసీమ జిల్లా పేరు మార్పు ఆందోళనల నేపధ్యంలో శాంతిభద్రతల కోసం 450 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు ఎస్పీ సుబ్బారెడ్డి.

Read Also: TS SSC Exams : నేటి నుంచి పదో తరగతి పరీక్షలు షురూ..

కాగా, అమలాపురం కేంద్రంగా ఏర్పాటైన కోనసీమ జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది.. కానీ, ఇదే ఇప్పుడు సర్కార్‌ తలనొప్పిగా మారింది.. గతంలో పేరు మార్చాలంటూ ఆందోళనలు సాగిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు పేరు మార్చొద్దంటూ నిరసనలకు దిగుతున్నారు.. ఈ నేపథ్యంలో.. 144 సెక్షన్‌ విధించారు పోలీసులు.