NTV Telugu Site icon

ప్రకాశం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం.. 12 కేసులు న‌మోదు, ముగ్గురు మృతి

black fungus

క‌రోనా స‌మ‌యంలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి.. భార‌త్‌లోని చాలా ప్రాంతాల్లో ఈ కేసులు వెలుగు చూస్తుండ‌గా… తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్య‌లో బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి బ్లాక్ ఫంగ‌స్ కేసులు… ఇక‌, ప్ర‌కాశం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తోంది… జిల్లాలో పది రోజుల వ్యవధిలో 12 మందికి పైగా బ్లాక్ ఫంగ‌స్ బారిన‌ప‌డ‌గా… కేవ‌లం మార్కాపురంలోనే ఏడుగురికి బ్లాక్ ఫంగస్ గుర్తించారు.. ఇక‌, బ్లాక్ ఫంగస్ భారిన పడి వారం రోజుల వ్యవధిలో ముగ్గురు మృతిచెంద‌డం ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.. మృతుల్లో మార్కాపురానికి చెందిన ఇద్దరు, చీరాలకు చెందిన ఒక‌రు ఉన్నారు. బాధితులంతా.. ఒంగోలు, మార్కాపురం, నంద్యాల, హైదరాబాద్, చెన్నై ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.