Site icon NTV Telugu

ఏపీలో డెప్యూటీ కలెక్టర్ల బదిలీలు…

ఏపీలో 11 మంది డెప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. శ్రీశైలం ఈవోగా లవన్న నియమించబడటంతో జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా శ్రీశైలం ఈవో కేఎస్‌ రామారావుకు ఆదేశాలు జారీ చేసారు. ఇక కోవూరు ఆర్డీఓగా ఏక మురళి, అమలాపురం ఆర్డీఓగా వసంత రాయుడు, ఏపీఎస్సీసీఎఫ్‌సీ కృష్ణా జిల్లా ఈడీగా చంద్ర లీల, గురజాల ఆర్డీఓగా పార్థసారధి, పులిచింతల స్పెషల్‌ కలెక్టర్‌ పీఏగా వసంత బాబు, కడప మున్సిపల్‌ కార్పోరేషన్‌ కమిషనర్‌గా రంగ స్వామి, నర్సిపట్నం ఆర్డీఓగా గోవింద రావు, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఓఏస్డీగా నర్శింహులు, కొవ్వాడ పవర్‌ ప్లాంట్‌ స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌గా హెచ్‌వీ జయరాం నియమించబడ్డాడు.

Exit mobile version