విశాఖ సీతమ్మధారలో 108 అడుగుల అభయాంజనేయ స్వామి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే.. ఈ కార్యక్రమంలో… ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ప్రతిష్టించారు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి.
ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి మాట్లాడుతూ… విశాఖలో ఇంత పెద్ద అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టించడం ఆనందదాయకంగా ఉందని తెలిపారు. సింహాద్రి అప్పన్న స్వామి, విశాఖ లో ఉన్న దేవతమూర్తులు విశాఖను కాపాడుతున్నారని వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలు నుంచి.. ఆ దేవతమూర్తులు రక్షిస్తున్నారని తెలిపారు. అభయాంజనేయ స్వామి దీవెనలు విశాఖ వాసులు పై ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
