NTV Telugu Site icon

Visakhapatnam: 101 సంవత్సరాల వయసులో 3 స్వర్ణ పథకాలను సాధించిన విశాఖ వాసి..

Untitled 1

Untitled 1

Visakhapatnam: ఓడిపోతానేమో అని అసలు ప్రయత్నించకపోవడం కంటే.. ప్రయత్నించి ఓడిపోవడం మేలు. సంకల్పం ఉంటె సాధించలేనిది అంటూ ఏది లేదు ఈ లోకంలో.. కావాల్సిందల్లా పోటీలో పాల్గొనాలి అనే ఆసక్తి.. అలానే మన పైన మనకు ఏదైనా సాదించగలను అనే నమ్మకం.. ఇవి రెండూ ఉంటె చాలు వయసు తో సంబంధం లేదు అని నిరూపించారు ఓ వ్యక్తి.. 101 సంవత్సరాల వయసులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 స్వర్ణ పతాకాలను సాధించారు. వివారాలోకి వెళ్తే.. ఈ నెల 8 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు 95 -99 ఏళ్ళ వారికి జావెలిన్ త్రో, షార్ట్ పుట్, 5 వేల మీటర్ల నడక పోటీలు నిర్వహించారు.

Reda also:Sitaram Yechury: ప్రత్యేక హోదాను వెనకేసుకొచ్చిన బీజేపీ మాటతప్పింది..

ఈ పోటీల్లో వి. శ్రీరాములు అనే వ్యక్తి విజేతగా నిలిచి మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. కాగా వి. శ్రీరాములు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విశాఖపట్నం జిల్లా కి చెందిన వారు. ప్రస్తుతం ఈయన వయసు 101 సంవత్సరాలు. ఈయన గతంలో నేవి లో విధులు నిర్వహించి రిటైరు అయ్యారు. అయితే 10 పదుల వయసు పైబడిన యువతకు ఏ మాత్రం తీసుపోను అంటూ ముందుకు వెళ్తున్నారు. 101 సంవత్సరాల వయసు లోనూ అథ్లెటిక్స్ లో పాల్గొని మన దేశానికి 3 స్వర్ణపతాకాలు తీసు వచ్చారు. వయసు పైబడిన ఏ మాత్రం లెక్క చేయకుండా అథ్లెటిక్స్ లో పాల్గొని 3 స్వర్ణ పతకాలను సాధించి భారత దేశ గౌరవాన్ని పెంచినవి. శ్రీరాములుని పలువురు ప్రసంసిస్తున్నారు.

Show comments