Site icon NTV Telugu

వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

గుంటూరు జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అమరావతి మండలంలోని ఉంగుటూరు గ్రామంలో గల చెరువు మరమ్మతుల విషయంలో వివాదం చెలరేగింది. దీంతో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. సర్పంచ్ భర్త సోమశేఖర్‌పై వైసీపీకి చెందిన రాయపాటి శివ వర్గం కర్రలతో దాడి చేసింది. సోమశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఉంగుటూరులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Exit mobile version