ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో ఏ2గా ఆరోపణలు ఎదుర్కొటున్న రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. గత శుక్రవారం ఏపీ సీఐడీ అధికారులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేసిన విషయం తెలసిందే. ఈ క్రమంలో నేడు ఆయనను సీఐడీ తమ ముందు హజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ రోజు సీఐడీ అధికారులు ముందు హజరుకావల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనను పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకు ఏపీ హైకోర్టు ఆశ్రయించారు. దీంతో ఏపీ హైకోర్టు లక్ష్మీనారాయణను 15 రోజుల పాటు అరెస్టు చేయవద్దని ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.