NTV Telugu Site icon

ఏపీ సీఎం ఢిల్లీ టూర్‌.. ప్రకాష్‌ జవదేకర్‌తో భేటీ.. వీటిపైనే చర్చ..!

Prakash Javadekar

Prakash Javadekar

హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న ఆయన… మొదటగా కేంద్ర మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌తో సమావేశమయ్యారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పెండింగ్‌ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లో భేటీ అయ్యారు.. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం.. కాగా, ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం వైఎస్ జగన్‌… శుక్రవారం రోజు తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.