ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు. కొన్నేళ్ల క్రితం దేశంలో ఈ పాట మార్మోగిపోయింది. నిత్యావసరాల ధరలు పెరగినప్పుడల్లా ఈ పాట వినిపించేది మనకు. ఇప్పుడు వంట నూనెల ధరల పరిస్థితి కూడా అదే. అప్పుడప్పుడు ఉల్లిధర ఉన్నట్టుండి కొండెక్కుతుంది. కొద్ది రోజులకు దిగి వస్తుంది. కనీ కుకింగ్ ఆయిల్ అలా కాదు. గత పాతికేళ్ల నుంచి వాటి ధరలు పైపైకి పోతున్నాయి. ఇక ఇప్పుడు. ఇప్పుడు ఎన్నడూ లేనంతంగా మండిపోతున్నాయి. దీంతో పేదవాడు ఏదీ వండుకోలేని పరిస్థితి. అలాగే మధ్య తరగతి వంటింటి బడ్జెట్‌పై కూడా వంటనూనెల ధరలు పెరగటం తీవ్ర ప్రభావం చూపుతోంది.
1991 లో ఆర్థిక సంస్కరణల వల్ల ప్రభావితమైన రంగాలలో వంట నూనెల పరిశ్రమ ఒకటి. ఈ ముప్పయ్ ఏళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. సంస్కరణల వల్ల ప్రజల ఆదాయం పెరిగింది. దాంతో పాటే నూనెల వినియోగం పెరిగింది. ఫలితంగా దేశంలో వంటనూనెల డిమాండ్ కూడా పైపైకి పోతోంది. ప్రస్తుతం మనం ఏడాది ఏడాదికి రెండున్నర కోట్ల వంట నూనెను వినియోగిస్తున్నాం. మరి అంత నూనె మన దగ్గర ఉందా అంటే ..లేదు. కేవలం కోటి టన్నుల వంట నూనె మాత్రమే దేశంలో ఉప్పత్తవుతోంది. అంటే దాదాపు కోటిన్నర టన్నుల కుకింగ్ ఆయిల్‌ని బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఇప్పుడు అదే చేస్తున్నాం. ఎంతలా అంటే వంట నూనెల దిగుమతిలో మన దేశమే నెంబర్ వన్. గత ఏడాది ఇండియాకు ఇంపోర్ట్ అయిన ఆయిల్ విలువ 11 బిలియన్ డాలర్లు. మనం దిగుమతి చేసుకునే క్రూడాయిల్‌లో ఇది 11 శాతం.
మధ్య తరగతి కుటుంబాలు ప్రతి నెలా వంట నూనెపై బోలెడు డబ్బు ఖర్చు చేస్తారు. వినియోగం బాగా పెరగటంతో ఇప్పుడు బారత్ ప్రతి ఏటా 14.5 మిలియన్ టన్నుల వంట నూనె దిగుమతి చేసుకుంటోంది. అందులో 60 నుంచి 70 శాతం ఫామాయిలే. ఫామ్ చెట్ల పెంపకంలో ఇండోనేషియా, మలేషియా టాప్. ప్రపంచంలో 45 శాతం ఫామాయిల్ ఒక్క ఇండోనేసియాలోనే ఉత్పత్తవుతోంది. 20 శాతంతో మలేషియా దాని తరువాత స్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో థాయ్‌లాండ్, కొలంబియా, నైజీరియా ఉన్నాయి. క్రూడాయిల్ మాదిరిగానే భారత్ ప్రభుత్వం వంట నూనెలపై కూడా దిగుమతి సుంకం విధిస్తుంది. ఈ పన్నుల ద్వారా భారీగానే ఆదాయం వస్తోంది. గత ఏడాది 30 వేల కోట్ల ఆదాయం సంపాదించింది కేంద్రం. ఈ ఏడాది 1,30 వేల కోట్ల రూపాయలని అంచనా.
క్రూడాయిల్ మాధిరిగానే ఫామ్ అయిల్ ధరలు గ్లోబల్ ట్రెండ్‌ని బట్టి మన దేశంలో మారుతాయి. మలేషియాలో ఇప్పుడు టన్ను ఫామాయిల్ ధర దాదాపు 70 వేల రూపాయలు. గత ఏడాది ఇది 40 వేలు. అంటే దాదాపు 60 శాతం పెరినట్టు. ఇక మన దేశంలో గత ఏడాది జూన్‌లో ఫామాయిల్ ధర కిలో 86 రూపాయలు ఉంటే ఇప్పుడది 138 రూపాయలకు చేరింది. సన్‌ఫ్లవర్ అయిల్ కిలో 170 రూపాయలు. వనస్పతి, సోయా. సన్‌ఫ్లవర్ అయిల్ ఇలా అన్ని నూనెల ధరలు పెరిగాయి. కుకింగ్ ఆయిల్ రేట్లు ఇంతలా పెరగటం 11 ఏళ్లలో ఇదే మొదటి సారి.
ఎడిబుల్ అయిల్ ..గ్లోబల్ ప్రైస్ ఎందుకు పెరిగిందో చూస్తే రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి కూలీల కొరత ..రెండు కాలం కలిసి రాకపోవటం. అంటే వాతావరణం అనుకూలించకపోవటం. కరోనా వల్ల గత ఏడాది మలేషియాలో తీవ్ర కూలీల కొరత ఏర్పడింది. ఆ దేశంలో వేలాది ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. అందుకు వివిద దేశాల నుంచి కూలీలను రప్పిస్తారు. కానీ గత ఏడాది కోవిడ్ మహమ్మారి వల్ల లేబర్ అక్కడికి వెళ్లలేకపోయారు. అది ఫామాయిల్ ఉత్పత్తి పడిపోవటానికి దారితీసింది.
మనం వాడే సోయాబీన్ ఆయిల్‌లో 85 శాతం అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి దిగుమతవుతోంది. ఇక సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో 90 శాతం రష్యా ఉక్రెయిన్ నుంచి వస్తోంది. మరి మన దేశం ఎందుకు ఉత్పత్తి చేయలేకపోతోంది? గత ఏడాది కేవలం 18 లక్షల హెక్టార్లలో మాత్రమే సోయాబీన్, వేరు శనగ సాగైంది. ఈ నేపథ్యంలో ఫామాయిల్ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫామ్ సాగును ఎంకరేజ్ చేయటానికి గాను 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. వంట నూనెల ధరల నియంత్రణకు మిషన్ ఆయిల్‌పామ్ పథకాన్ని చేపట్టింది. చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో!!
