NTV Telugu Site icon

Jyothi Rai: రెండో పెళ్లి చేసుకున్న నటి.. ఇదే సాక్ష్యం?

Johi Rai

Johi Rai

స్టార్ మా లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న టాప్ సీరియల్ గుప్పెడంత మనసు గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ఈ సీరియల్ లో హీరో తల్లిగా నటించిన జగతి గుర్తుందా.. ఆమె అసలు పేరు జ్యోతి రాయ్ కన్నడ నటి.. ఈమె కన్నడ ఇండస్ట్రీలో సీరియల్స్‌తో పాటు సినిమాలు కూడా చేసింది.. సీరియల్‌లో సాంప్రదాయ కట్టుబొట్టుతో పద్ధతిగా కనిపించే ఆమె సోషల్‌ మీడియాలో మాత్రం అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది. ఇకపోతే ఈ మధ్య జ్యోతి రాయ్‌ పేరు నెట్టింట మార్మోగిపోతోంది. అందుకు కారణం.. యువ దర్శకుడితో ఎఫైర్‌ పెట్టుకోవడమే అని తెలుస్తుంది.. గత కొద్ది రోజులుగా ఈ వార్తపై చర్చలు జరుగుతున్నాయి..

ఈ అమ్మడు తన 20 వ ఏటానే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి కాగా.. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. మరి ఏమైందో ఏమో కానీ ఈ నటి తన భర్తను వదిలేసి ఓ డైరెక్టర్ తో ప్రేమలో ఉందని పుకారు షికారు చేస్తోంది. మాట రాని మౌనమిది, శుక్ర సినిమాల డైరెక్టర్‌ సుకు పుర్వాజ్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో ఈ పుకార్లు మరింత పుంజుకున్నాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్న అనుమానాలు కూడా వస్తున్నాయి..

తాజాగా మరోసారి ఈ అనుమానం నిజమునే సాక్ష్యం దొరికింది.. ఈమె కొత్తగా ట్విటర్‌ ఖాతా తెరిచింది. ప్రియుడు పేరు సుకుపుర్వాజ్‌ను తన పేరులో జోడిస్తూ జ్యోతి పుర్వాజ్‌ అని తన ఖాతాకు కొత్త పేరు పెట్టుకుంది. నిజానికి పెళ్లయ్యాక పేరు చివరన భర్త పేరు పెట్టుకుంటారు. ఈ లెక్కన జ్యోతి-సుకుపుర్వాజ్‌ పెళ్లయిపోయినట్లే కనిపిస్తోంది. మరి నిజంగానే జ్యోతిరాయ్‌ రెండో పెళ్లి చేసుకుందా?లేదా రిలేషన్ లో ఉన్నారా అనేది మాత్రం తెలియలేదు కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.. ‘బందె బరాటవ కాలా’ సీరియల్‌ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. 20కి పైగా సీరియల్స్‌లో నటించిన జ్యోతిరాయ్‌.. తుళు, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో నటించింది. సీరియల్స్‌తో పాటు ‘సీతారామ కళ్యాణ’, ‘గంధాడ్ గుడి’, ’99’, ‘దియ వర్ణపాటల’ సినిమాల్లో నటించింది. ఇప్పుడు వెబ్ సిరీస్ లను కూడా చేస్తుంది..