Site icon NTV Telugu

Gas Rates in Modi Regime: మోడీ హయాంలో మోయలేని భారం. రూ.410 నుంచి.. రూ.11,00 నాటౌట్‌ వరకు

Lpg, Modi

Lpg, Modi

గ్యాస్‌ బండ రేటు కొండలా పెరిగిపోతోంది. మోడీ హయాంలో మోయలేని భారంగా మారింది. గత ఎనిమిదేళ్లలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర దాదాపు రెండు రెట్లు అయింది. 2014 మార్చి 1న కేవలం 410 రూపాయలు మాత్రమే ఉన్న గ్యాస్‌ రేట్‌ ఇవాళ 11,00 దాటింది. ఇది 14.2 కేజీల గృహవసరాల సబ్సిడీ సిలిండర్‌ ధర మాత్రమే కావటం గమనార్హం. ఈరోజు ఒక్కసారే రూ.50 పెరగటంతో 11,00కు చేరింది. హైదరాబాద్‌లో నిన్నటి వరకు రూ.1055గా ఉన్న ధర ఇవాళ రూ.11,05కి పెరిగింది.

ఎల్‌పీజీ రేట్‌ గత ఏడేళ్లలో ఒక రెట్టు పెరగగా ఈ ఒక్క సంవత్సరంలోనే మరో రెట్టు పెరగటం గమనార్హం. 2014లో 400 చిల్లర ఉన్న వంట గ్యాస్‌ ధర 2015 డిసెంబర్‌కే రూ.600 దాటింది. 2016లో రూ.630కి, 2017లో 646కి, 2018లో 900కి చేరింది. 2019లో మాత్రం కొంచెం తగ్గింది. 700కి దిగొచ్చింది. తర్వాతి సంవత్సరం(2020లో) 910, 2021లో 900 చిల్లర ఉంది. 2022 జూలై నాటికి ఏకంగా రూ.200 పెరిగి, 1100కి చేరుకుంది. నాన్‌ సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.2000 దాటింది. మొన్నీమధ్యే కమర్షియల్ సిలిండర్‌ రేటను రూ.183. తగ్గించి ఊరటనిచ్చిన గ్యాస్‌ కంపెనీలు ఇవాళ సామాన్యులకు ఝలక్‌ ఇచ్చాయి.

read also: NASA Satellite: తప్పిన శాస్త్రవేత్త‌ల అంచ‌నా..! చంద‌మామకు ముప్పు..?

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎల్‌పీజీ ధర ఊహించనిరీతిలో పెరిగిపోతుండటంతో సబ్సిడీ అంతకంతకూ తగ్గుతోంది. ఒకప్పుడు రూ.100, రూ.150 వరకూ కస్టమర్‌ ఖాతాలో పడే సబ్సిడీ డబ్బు ఇప్పుడు 20, 30 రూపాయలకే పరిమితమవుతోంది. దీందో ఆమ్‌ ఆద్మీ ఆందోళనకు గురవుతున్నాడు. గ్యాస్‌ రేటు ప్రతి నెలా మారుతుండటంతో ఎప్పుడు ఎంత ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వీటితోపాటు కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకునేటప్పుడు చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ల రేట్లు సైతం ఇటీవల పెరిగాయి.

గతంలో 14.2 కేజీల గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే రూ.1450 కడితే సరిపోయేది. ఇప్పుడు రూ.2200కి పెంచారు. దీనివల్ల ఎక్‌స్ట్రా రూ.750 ఇవ్వాలి. 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే ఇంతకుముందు రూ.2550 ఇవ్వాల్సి ఉండగా ఇప్పుడు ఈ డిపాజిట్‌ని రూ.3600కి పెంచాయి. అంటే అదనంగా రూ.1050 కట్టాలి. 5 కేజీల సిలిండర్‌ కనెక్షన్‌ కోసం రూ.350 ఎక్కువ చెల్లించాలి. మోడీ అధికారంలోకి వచ్చాక సబ్సిడీ సిలిండర్ల పరిమితిని ఏడాదికి 12కే పరిమితం చేశారు. అంతకన్నా ఎక్కువ సిలిండర్లు బుక్‌ చేస్తే సబ్సిడీ వర్తించదు.

CPI Narayana : బీజేపీ-వైసీపీ బంధం చాలా అన్యోన్యంగా ఉంది

Exit mobile version