NTV Telugu Site icon

Fake watch : యాపిల్ వాచ్ ఆర్డర్ ఇస్తే ఫేక్ వాచ్ డెలివరీ.. క్షమాపణలు చెప్పిన అమెజాన్..

Fake Watch

Fake Watch

ఈమధ్య కాలంలో ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది.. ఫుడ్ కు సంబందించిన వస్తువుల నుంచి వేసుకొనే ఇన్నెర్స్ వరకు ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు.. ఇక కస్టమర్ల కోసం ఈ కామర్స్ కంపెనీలు రోజుకొకటి పుట్టుకోస్తుంది.. ప్రముఖ కంపెనీ తమ సైట్ ఫెమస్ అవ్వడానికి కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు.. దీంతో జనాలు ఏది కొనాలాన్నా కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు.. అయితే కొన్నిసార్లు పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి.. తప్పుడు వస్తువు రావడం.. లేదా మోసానికి గురవ్వడం.. తాజాగా ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది..

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో .50,900 విలువ చేసే యాపిల్ వాచ్ ఆర్డర్ చేసి ఫేక్ వాచ్ పొంది మోసపోయానని ఆ మహిళ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అంతేకాదు తను ఎలా మోసపోయానో చెబుతూ ఆ మహిళ డీటెయిల్స్ మొత్తం సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

వివరాల్లోకి వెళితే..సనయ అనే మహిళ తను ఆర్డర్ చేసిన యాపిల్ వాచ్ డీటెయిల్స్‌తో పాటు తనకు వచ్చిన ఫేక్ వాచ్ ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఆమె ఆపిల్ వాచ్ (Apple Watch) సిరీస్ 8 ని రూ.50,900 లకి ఆర్డర్ చేసింది. అయితే యాపిల్ వాచ్‌కి బదులుగా జూలై 9 న ‘ఫిట్ లైఫ్’ (Fit Life) వాచ్ డెలివరీ అయ్యిందని తెలుసుకుని షాకయ్యింది. అమెజాన్‌కి ఈ విషయం కంప్లైంట్ చేస్తే వాపసు లేదా మార్పిడిని అందించలేమని చెప్పినట్లు ఆమె తన పోస్టులో పేర్కొంది. ‘అమెజాన్ నుంచి ఎప్పుడూ ఆర్డర్ చేయకండి.. నేను ఆర్డర్ చేసాను యాపిల్ 8 సిరీస్ చూడండి. 9 వ తేదీన నకిలీ ‘ఫిట్ లైఫ్’ వాచ్ వచ్చింది. అమెజాన్ ఈ సమస్యను పరిష్కరించలేదు’ అంటూ అమెజాన్ హెల్ప్ లైన్ ట్యాగ్‌తో షేర్ చేసింది.. అయితే ఆ ట్వీట్ కు తాజాగా అమెజాన్ టీమ్ స్పందించింది..ఆమెకు ట్విట్టర్‌లో క్షమాపణలు చెప్పింది. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు తమ అనుభవాలను పంచుకున్నారు. ఖరీదైన గాడ్జెలను ఆన్‌లైన్‌లో ఆర్డర్చెయ్యవద్దని సలహాలు ఇస్తున్నారు.. మరి దీనిపై అమెజాన్ ప్రతినిధులు ఎలా స్పందిస్తారో చూడాలి..