Site icon NTV Telugu

Women Farmers: మనల్ని పోషించే చేతులు

మహిళలు ఇప్పుడు క్రమంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. కానీ, గతంలో మహిళలు వ్యవసాయ రంగానికే పరిమితం అయ్యారు.. మహిళా రైతులు, మహిళా కూలీలు.. ఇలా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.. తమకు ప్రతీకూల పరిస్థితులు ఎదురై.. ఇంట్లో వ్యవసాయం చేసేవారు లేకపోతే.. తాము సైతం అంటూ నడుం కట్టి వ్యవసాయం చేసేవారు ఎంతో మంది ఉన్నారు.. తాజా గణాంకాల ప్రకారం గ్రామీణ భారతదేశంలో, దాదాపు 84 శాతం మంది మహిళలు జీవనాధారం కోసం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని.. అందులో 33 శాతం మంది రైతులు కాగా, 47 శాతం మంది రైతు కూలీలుగా పనిచేస్తున్నారు.

Read Also: PK in Telangana: ప్రాజెక్టులను చుట్టేస్తోన్న ప్రశాంత్‌ కిషోర్, ప్రకాష్‌ రాజ్..

అయితే, వ్యవసాయ రంగంలో రాణిస్తున్న ఓ మహిళ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆమె వ్యవసాయంలో అవలంభిస్తోన్న విధానాలు, పంట సాగు.. ఇలా ఎన్నో విషయాలను మీ ముందు ఉంచుతున్నాం.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బాబుల్‌గావ్‌ గ్రామానికి చెందిన మహిళా రైతు లక్ష్మీబాయికి మూడు ఎకరాల పొలం ఉంది.. తన భర్త ఉన్నప్పుడు నాగలి కట్టి వ్యవసాయం చేసేవారు.. కానీ, ఆయన చనిపోయిన తర్వాత కూడా వ్యవసాయం చేస్తున్నాను.. ట్రాక్టర్ల సాయంతో సాగు చేస్తున్నాను.. తాను ప్రస్తుతం రెండు ఎకరాల పొలంలో వేరుశనగ పంటను సాగు చేస్తున్నాను అని తెలిపారు.. ఎన్ని విత్తనాలు పట్టాయి.. సాగులో ఎదురవుతోన్న ఇబ్బందులు, తెగుల్లు, అడవి జంతువుల బారి నుంచి పంటను కాపాడుకోవడం.. విత్తనాల కోసం ఇబ్బందులు.. పంట అమ్మె సమయంలో ఎదురయ్యే సవాళ్లు.. ఇలా ఎన్నో ఆమె ఈ ఎపిసోడ్‌లో పంచుకున్నారు.. కింది వీడియోను క్లిక్‌ చేసి.. ఆ మహిళా రైతు గురించి తెలుసుకోవచ్చు..

Exit mobile version