NTV Telugu Site icon

Tarmarind Cultivation : రైతులకు సిరులు కురిపిస్తున్న చింత సాగు..

Tarmarind

Tarmarind

చింతపండుకు మన దేశంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ చెట్టు లను కలప గా కూడా వాడుతున్నారు.. చక్కెర మిల్లులలో పనిముట్లను, ఇతర ఫర్నీచర్స్ తయారీలో ఉపయోగిస్తారు.చింత చెట్టును నీడ కొరకు, అలంకరణ కొరకు, కాయల కొరకు పెంచుతారు. ఇది సెంట్రల్ ఆఫ్రికాలో విస్తారంగా పెరుగును. మన దేశంలో ఎక్కడ చూసిన రోడ్డు పక్కన విరివిగా కనిపిస్తాయి.. చింత గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మొక్కలు ఉష్ణ మండల వాతావరణంలో పెరిగే చెట్టు ఈ చెట్టు నివసించే ప్రాంతాలలో 0-47° సెం.గ్రే ఉష్ణోగ్రత ఉండును. వర్షపాతం 500-1500 మిల్లీ మీటర్లు ఉండినచో ఈ చెట్టు బాగా పెరుగును.. ఇకపోతే ఈ మొక్కలు లోతైనా ఒండ్రుమట్టి గల నేలల్లో బాగా పెరుగును.ఈ చెట్టు కొద్దిగా క్షారత్వం గల మరియు ఉప్పు గల నేలలను తట్టుకొనును. ఈ చెట్టు ఆకురాల్చు అడవులలోనూ, ఎత్తు పళ్ళములున్నా ప్రదేశంలోనూ కొద్దిగా ఏటవాలుగా ఉన్నచోట బాగా పెరుగుతాయి..

కొత్తగా పోగు చేసిన విత్తనాలను నారు మడులలో వేసుకోవాలి.. ఈ విత్తనాలను మార్చి, ఏప్రిల్ మధ్యలో వేసుకోవాలి… మొలకెత్తుట ఒక వారంలో ప్రారంభమగును. నాటుటకు అవసరమయ్యే 30 సెం.మీ మొక్క కలిగి ఉండాలి. ఒకవేళ లేత చెట్టు ఎత్తు పెరగక బలహీనంగా ఉన్నచో అలాంటి చెట్లను నారుమడిలో మరొక సంవత్సరం ఉంచి వచ్చే వర్షాకాలంలో నాటుకోవాలి.. ఇక రోడ్ల ప్రక్కన నాటుటకు లేత చెట్లను 15*15 మీటర్ల దూరంలో 30 సెం.మీ పరిమాణం గల గుంతలో నాటాలి. పూర్తిగా చింతచెట్టు గల వనంలో 5*5 మీ దూరం పాటిస్తూ చెట్లు బాగా పెరిగిన తర్వాత 10*10 మీటర్ల దూరం పాటించాలి.. ఇక 1 హెక్టారుకు 200 కేజీ విత్తనము సరి పోతుంది.. చింత సాగు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే దగ్గరలోని వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..