NTV Telugu Site icon

Goat Farming: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చు..

Goat Farming

Goat Farming

రైతులు వ్యవసాయం మాత్రమే కాదు, పాడి, పశువుల పెంపకం కూడా చేస్తున్నారు.. వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా ఆధారపడి అధిక లాభాలను అర్జిస్తున్నారు. అయితే ఈ నేపద్యంలో ప్రసుత్తం తక్కువ పెట్టుబడితో నెలకు రెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చే అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తున్నారు… ముఖ్యంగా మార్కెట్ లో ఎక్కువగా మటన్ కు డిమాండ్ ఉంది.. దాంతో చాలా మంది రైతులు మేకలు, గొర్రెల పెంపకాన్ని చేపడుతున్నారు..

బయట ఎక్కడైనా గొర్రెల పెంపకాన్ని చేపట్ట వచ్చు లేదా దొడ్డిలో షెడ్డు వేసి గొర్రెలను, మేకలను పెంచవచ్చును. మెట్ట సేద్యం లో గొర్రెల పెంపకం అనేది ముఖ్యమైనది. కొద్దిపాటి పెట్టుబడితో సన్నకారు, చిన్నకారు రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు గొర్రెల పెంపకం అనేది లాభసాటి ఉపాధిగా ఉంటుంది.. తక్కువ పెట్టుబడితో నెలకు రెండు లక్షల రూపాయల ఆదాయం తెచ్చే మేకల పెంపకం, గొర్రెల పెంపకం మంచి లాభాలను తెచ్చిపెడుతోంది..

ఈ గొర్రెల పెంపకంలో పెద్దగా తీసుకోవలసిన అతి జాగ్రత్తలేవీ ఏమి లేవు. పైగా పర్యావరణానికి గొర్రెలు తేలికగా అలవాటు పడి పోతాయి. రోజు రోజుకు మాంసం ధర పెరుగుతుంటుంది.. మందలో ఎటు లేదనుకున్నా కూడా గొర్రెల పెంపకం లాభసాటిగా ఉంటుంది.. గొర్రె ఒక్కింటికి 20-30 కి. గ్రా. మాంసం లభిస్తుంది. పశుపోషణను కొనసాగించేందుకు గ్రామీణ ప్రాంతాలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేస్తున్నారు… ఒక్కో రాష్ట్రాన్ని బట్టి వీటి కొనుగోలుపై సబ్సిడీని మంజూరు చేస్తున్నారు. అయితే వీటి పెంపకం వ్యాపారం కోసం, వాతావరణం అనేది చాలా ముఖ్యమైనది.. ఆవులు, గేదెల కన్నా కూడా ఎక్కువగా మేకలను పెంచడం చాలా సులువు అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు..