వర్షాకాలం వస్తే చాలు మనుషులకే కాదు, జంతువులకు కూడా అనేక రకాల వ్యాదులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. వర్షాలకు సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండటం వల్ల అనేక రకాల వ్యాదులు వస్తాయి. అందులో ముఖ్యంగా గొంతు వాపు దీన్నే గురక వ్యాధి అనికూడా అంటారు.. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మజీవుల వలన సంక్రమిస్తుంది.. పశువుల్లో తొలకరి వర్షాలు పడినప్పుడు కలుషితమైన నీరు మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు వ్యాధి బారిన పడతాయి. వర్షాకాలంలో వ్యాధి ఎక్కువగా దున్నలు గేదెలలో వస్తోంది.
నీరసంగా ఉన్న పశువులకు వ్యాధి త్వరగా సోకుతోంది. పల్లపు ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలలో ఈవ్యాధి ఎక్కువగా వస్తుంది. ఇది అంటువ్యాధి ఇతర పశువులకు సోకుతుంది.. ఈ వ్యాధి సోకితే తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తుంది.. ఈవ్యాధి పాశ్చరెల్లా ముల్లోసిడా అనే సూక్షజీవి వల్లన వస్తుంది.. ఈ వ్యాధి ఎనిమిది నెలల నుంచి రెండేళ్లలోపు ఉన్న పశువులకు వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొంతు వాపు వ్యాధి బారిన పశువులను మిగతా పశువులతో కలిపి ఉంచితే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఒకే పాకలో ఉంచకుండా వాటిని వేరు చేయాలి. వ్యాధి సోకిన పశువు తిన్న గడ్డిని ఆర్యోగ్యకరమైన పశువు తిన్నడం వల్లన ఈవ్యాధి సోకే అవకాశం ఉంటుంది..
ఈ వ్యాధి సోకిన పశువు నోటి నుంచి కారే చొంగ ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి పశువులను రవాణా చేసినప్పుడు వ్యాధి సోకుతుంది.. ఈ వ్యాధి సోకిన పశువులకు ఐదు రోజుల్లోనే వ్యాధి లక్షణాలు బయట పడతాయి..చర్మం వదులుగా ఉన్న చోట ద్రవం చేరి గొంతు బాగా ఉబ్బి ఉంటుంది. చేతితో గట్టిగా ఒత్తితే గుంట మాదిరిగా ఏర్పడుతోంది. కళ్ళ నుంచి నీరు ముక్కు నుంచి ద్రవం కారుతోంది. పశువులకు శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ముక్కు నుంచి రసపూరితమైన ద్రవాలు కారుతూ ఉంటాయి.. లోపల పుండ్లు ఏర్పడుతాయి.. ఇకపోతే పశువులు ఆయాస పడతాయి..
కొన్నిసార్లు వ్యాధి సోకిన పశువు లక్షణాలు 24 గంటల్లోపు మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. ప్రయోగశాలలో రక్త పరీక్ష చేయించి బైపోలర్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాని గుర్తించడం వలన వ్యాధిని నిర్ధారిస్తారు. పశువు చనిపోయిన తర్వాత శవపరీక్ష చేసి కూడా వ్యాధిని నిర్ధారించవచ్చు.. ఈ వ్యాదులు రాకుండా ఉండేందుకు వైద్యులు ఇచ్చే టీకాలను వేయించడం మంచిది.. అప్పుడే వ్యాదులు రాకుండా ఉంటాయి..