NTV Telugu Site icon

Banana Cultivation : అరటి కోతల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Banana Farming

Banana Farming

మనదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అరటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు.. దేశంలో 4.84 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 16.3 మిలియన్ టన్నుల అరటి ఉత్పత్తి అవుతుంది. జాతీయ స్థాయిలో అరటి పంట మొదటి స్థానం. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 18 శాతం అరటిదే. తమిళనాడు మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలో అరటి ముందు స్థానంలో ఉంది.. ఆ తర్వాత నాల్గొవ స్థానంలో ఏపీ ఉంది..ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 4 వ స్థానంలో ఉత్పాదకతలో 5వ స్థానంలో ఉంది. చిత్తూరు, కర్నూలు, అనంతపూర్, తూర్పుగోదావరి, వైజాక్, కృష్ణా, శ్రీకాకుళం,వరంగల్,రంగారెడ్డి, మెదక్ వంటి జిల్లాల్లో ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు.. వాణిజ్య పంటగా అరటిని రైతులు సాగు చేస్తున్నారు..

అరటి కోతల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచిది లాభాలను పొందవచ్చు.. అదేంటంటే.. గెలను కోసిన తర్వాత వెంటనే నీడలో ఉంచాలి. ఎండలో వుంచరాదు. ఎండలో ఉంచడం వలన కాయల లోపల వేడిమి పెరిగి కాయలు త్వరగా పండటం ప్రారంభిస్తాయి.వంపు తిరిగిన పదునైన కత్తిని ఉపయోగించి 15 నుండి 20 కాయలు వుండునట్లుగా హస్తములను అరటి గెలల నుంచి వేరు చెయ్యాలి.ఈ విధంగా వేరు చేసిన కాయలను సోన పూర్తిగా కారనిచ్చి, బాగా శుభ్రపరచాలి..కాయలను శుభరపరచడానికి 0.5 గ్రా బావిస్టన్ మందును లీటరు నీటికి కలిపినట్లయితే ఎలాంటి శిలీంధ్రములు ఆశించకుండా ఎక్కువ కాలం నిలువ ఉంటాయి.

అలాగే పండిన కాయలను పచ్చి కాయలను వేరు చెయ్యాలి.. కాయలను లేదా గెలలను ట్రక్కులు, రైలు పెట్టెల ద్వారా రవాణా చేయునప్పుడు ఒక క్రమ పద్ధతిలో గెలలను నిలువుగా అమర్చి, పై గెలల బరువు క్రింద ఉన్నటువంటి గెలల మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. అప్పుడే గెలలు పాడవ్వకుండా ఫ్రెష్ గా ఉంటాయి..మాగ పెట్టిన అరటి పండ్లను 15°c ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిలువ చేయరాదు. ఇలా చేసినట్లయితే కాయలు త్వరగా నల్లగా మారి త్వరగా పాడై పోతాయి..ఇలాంటి జాగ్రత్తలను తీసుకోవడం వల్ల మార్కెట్ లో డిమాండ్ కూడా పెరుగుతుంది… అధిక దిగుబడిని పొందవచ్చు..