Site icon NTV Telugu

Zip Saree: మహిళలకు ఊరట.. ఇప్పుడు కేవలం10 సెకన్లలో చీర కట్టుకోవచ్చు..ఈ వీడియో చూడండి

Zip Sarees

Zip Sarees

‘చీరలోని గొప్పతనం తెలుసుకో.. చీర కట్టి ఆడతనం పెంచుకో.. సింగారమనే దారంతో చేసింది చీర.. ఆనందమనే రంగులనే అద్దింది చీర.. మమకారమనే మగ్గంపై నేసింది చీర..’ అంటూ సినీ గేయ రచయిత చంద్రబోస్ రాసిన పాట చీరలోని అందం.. ఆ చీరతో ఆడపడుచు సౌందర్యాన్ని చక్కగా వర్ణించారు. మరోవైపు.. ‘అమ్మ చీరనే కట్టే పాప జ్ఞాపకం..’ అనేది ఎంత అందమైన భావనో కదా!. కానీ.. ప్రస్తుత సమ పరిస్థితులు చూస్తుంటే.. “ఒకప్పుడు మా అవ్వలు చీరలు కట్టుకునే వారట” అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. బిజీ లైఫ్, ఫ్యాషన్, చీర కట్టుకోవడానికి రాకపోవడం వంటి కారణాలతో నేటి యువతులు చీరలను పక్కన పెట్టేస్తున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు తప్ప.. ఎప్పుడూ చీరలను కట్టుకోవడం లేదు.. కొందరైతే మరీ దారుణం.. వాళ్ల పెళ్లికి మాత్రమే చీర కట్టుకుంటున్నారు.

READ MORE: Gold Rate Today: తగ్గిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఇవే!

విదేశీయులు సైతం మన చీరకు ఆకర్శితులవుతుంటే మన వాళ్లు మాత్రం జీన్స్, టీ షర్టులకు బానిసలవుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మహిళ కేవలం 10 సెకన్లలో చీరను కట్టుకుంది. నిజానికి ఈ యువతి కట్టుకున్నది ఓ “చీర జిప్ చీర”. ఆడవాళ్లు చీర కట్టుకోవడానికి భయపడాల్సిన పనిలేకుండా జిప్‌తో కూడిన ‘రెడీ టు వేర్’ చీరలు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. 10 సెకన్లలో ఓ మహిళ జిప్డ్ చీర కట్టుకుని రెడీ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి చీర, బ్లౌజ్ జతచేయబడి పైభాగంలో జిప్ ఇవ్వబడింది. ఈ వీడియో చూసిన.. వినియోగదారులు కూడా చీర కట్టుకునే మార్గాలు నిజంగా మార్కెట్లోకి రావడం ప్రారంభించాయా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకి ఇప్పటివరకు లక్షలలో వీవ్స్ వచ్చాయి. ఈ పోస్ట్‌ని చూసిన తర్వాత వందలాది మంది వినియోగదారులు తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు. కొందరు పాజిటివ్, కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మహిళలు మాత్రం ఈ చీరలు తయారు చేసిన వారిని కొనియాడుతున్నారు.

Exit mobile version