Site icon NTV Telugu

Youtuber Record: 42 సెక‌న్ల‌లో రూ. 1.75 కోట్ల సంపాద‌న‌…

డ‌బ్బు సంపాద‌న‌కు యూట్యూబ్ ఒక ప్లాట్‌ఫామ్‌గా మారింది. వీడియోలు క్రియోట్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నారు. వీడియోలు ట్రెండ్ చేస్తూ డ‌బ్బుసంపాదిస్తున్నారు. అయితే, క్యాలిఫోర్నియాకు చెందిన జొనాథ‌న్ మా అనే యూట్యూబ‌ర్ కేవ‌లం 42 సెకన్ల‌లోనే యూట్యూబ్ ద్వారా 1.75 కోట్ల రూపాయ‌లు సంపాదించి సంచ‌ల‌నం సృష్టించాడు. జోమా టెక్ పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్‌ను క్రియోట్ చేసిన జొనాథ‌న్ మా, టెక్ వీడియోల‌ను అప్లోడ్ చేస్తుంటాడు. ముఖ్యంగా ప్రోగ్రామింగ్, క్రిఫ్టోక‌రెన్సీ త‌దిత‌ర టెక్నాల‌జీకి సంబంధించిన వీడియోల‌ను అప్లోడ్ చేస్తుంటాడు.

Read: Manchu Mohanbabu: ట్రోల్స్ చేసే వారికి మంచు ఫ్యామిలీ హెచ్చరిక

ఇందులో భాగంగానే వాక్సీడ్ డాగ్‌గోస్ పేరుతో మా ఎన్ఎఫ్‌టీ కలెక్ష‌న్లు విడుద‌ల చేశారు. ఈ క‌లెక్ష‌న్లు ఆయ‌న‌కు వ‌సూళ్ల పంట పండించాయి. కేవ‌లం 42 సెకన్ల వ్య‌వ‌ధిలో సుమారు రూ. 1.75 కోట్ల రూపాయ‌లు ఆర్జించే విధంగా చేశాయి. అన్ని ఖ‌ర్చులు పోను సుమారు రూ. 1.45 కోట్లు మిగిలిన‌ట్లు పేర్కోన్నాడు. త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని ఉందని, త‌ప్ప‌కుండా త్వ‌రలోనే సినిమాను తీస్తాన‌ని అంటున్నాడు.

Exit mobile version