ఢిల్లీలో ఓ యూట్యూబర్ అత్యుత్సాహంతో చేసిన పనికి కటకటాలపాలయ్యాడు. ఢిల్లీకి చెందిన యూట్యూబర్ గౌరవ్ శర్మ ఇటీవల తన పెంపుడు కుక్కను.. హైడ్రోజన్ బెలూన్లకు కట్టి వీడియోను తయారు చేశాడు. వాటితో కలిపి కుక్కను ఎగరవేసాడు. అది కాస్తా వైరల్‌గా మారడంతో చూసినవాళ్లంతా ఆ యూట్యూబర్‌పై విమర్శలు చేశారు. అంతేకాదు, జంతు ప్రేమికులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఆ యూట్యూబర్ పై పోలీస్ కేసు నమోదు అయింది. అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఓ వైపు నెటిజన్ల ఫిర్యాదులు, మరోవైపు పోలీసుల కేసుతో తన ప్రశ్చాత్తాపం వ్యక్తంచేస్తూ మరో వీడియో చేశాడు. తాను చేసిన వీడియోను తొలగించి.. చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పాడు.
అత్యుత్సాహంతో కటకటాలపాలైన యూట్యూబర్
