NTV Telugu Site icon

అత‌ని వ‌య‌స్సు 66, సంతానం 129 మంది…

ఈరోజుల్లో ఒక‌రిద్ద‌రు సంతానం అంటే స‌రే అనుకోవ‌చ్చు. కొంత‌మందికి ఎంత ప్ర‌య‌త్నించినా అస‌లు సంతానం క‌ల‌గ‌దు. కానీ, ఆ వ్య‌క్తి ఇప్ప‌టి వ‌ర‌కు 129 మంది సంతానానికి తండ్రి అయ్యాడు. మ‌రో 9 మంది సంతానానికి తండ్రి కాబోతున్నాడు. దీనిని ఆయ‌న గ‌ర్వంగా చెప్పుకుంటున్నాడు. కానీ, ఆయ‌న‌కు ఇదే కొత్త చిక్కులు తెచ్చిపెట్ట‌బోతున్నాయి. ఇంత మందిని ఎలా క‌న్నాడు అనే డౌట్ రావొచ్చు. స్పెర్మ‌డోనార్ ద్వారా ఆయ‌న ఇంత మందికి తండ్రి అయ్యాడు. ఆధునిక కాలంలో స్పెర్మ్ డోనేష‌న్ ప్ర‌క్రియ వేగంగా జ‌రుగుతున్న‌ది. సంతానం లేని వారికి స్పెర్మ్‌ను డోనేష‌న్ చేస్తున్నారు. అయితే, దీనికి ప్ర‌భుత్వం నుంచి లైసెన్స్ పొంది ఉండాలి.

Read: ఒమిక్రాన్ సోకిన‌వారిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి.. ఐసీఎంఆర్ స్ట‌డీలో కీల‌క అంశాలు

అంతేకాదు, ఇంగ్లాండ్ చ‌ట్టాల ప్ర‌కారం, స్పెర్మ్‌డోనేష‌న్ చేసేవారి గ‌రిష్ట వ‌య‌స్సు 45 కి మించి ఉండ‌కూడ‌దు. కానీ, యూకేకు చెంద‌ని క్లైవ్ జోన్స్ వ‌య‌సు ప్ర‌స్తుతం 66 ఏళ్లు. త‌న‌కు 58 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్ప‌టి నుంచి స్పెర్మ్‌ను డొనేట్ చేస్తూ వ‌స్తున్నాడు. కొన్ని అన‌ధికారిక క్లీనిక్‌ల ద్వారా స్పెర్మ్ డోనేట్ చేస్తూ రావ‌డంతో ఆయ‌న‌పై అక్క‌డి ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. కానీ, క్లైవ్ మాత్రం అవేమీ ప‌ట్టించుకోవ‌డం లేదు. పిల్ల‌లు లేని వారికి సంతానం క‌లిగించ‌డం కోసం త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని, త‌న‌కు చాలా సంతోషంగా ఉంద‌ని చెబుత‌న్నాడు.