Site icon NTV Telugu

Viral: ఆ ప్ర‌శ్న‌కు అలా స‌మాధానం చెప్పి… వైర‌ల్ అయింది…

క‌రోనా కాలంలో ప్ర‌తి ఒక్క‌రూ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌కు అలవాటుప‌డిపోయారు. ఉద్యోగాల‌తో పాటు ఇంట‌ర్వ్యూలు కూడా ఆన్‌లైన్ ద్వారానే జ‌రుగుతున్నాయి. ఇంటివ‌ద్ద నుంచి ప‌నిచేసే స‌మ‌యంలో కొన్ని సంద‌ర్భాల్లో ఫ‌న్నీ సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది. స్కైవెస్ట్ ఎయిర్‌లైన్స్ లో ఫ్లైట్ అటెండెంట్ జాబ్ కోసం మార్టినెజ్ అనే యువ‌తి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసింది. దీనికి సంబంధించిన ఇంట‌ర్వ్యూ ఆన్‌లైన్ ద్వారానే జ‌రిగింది. ఇంట‌ర్వ్యూలో ఆమెను స్కైవెస్ట్ క‌ల్చ‌ర్ గురించి మీ అభిప్రాయం ఏంట‌ని ప్ర‌శ్నించారు. నా జీవితంలో విన్న‌తెలివిత‌క్కువ ప్ర‌శ్న, చీజీ ప్ర‌శ్న అని పక్క‌న ఉన్న‌వారితో చెప్పింది.

Read: Exams: ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసిన అనురాగ్ యూనివర్సిటీ

ఈ స‌మాధానం విన్న స్కైవెస్ట్ అధికారులు అవాక్క‌య్యారు. అయితే, అమెకు ఇంట‌ర్వ్యూను రిజ‌క్ట్ చేస్తున్న‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు. వెంట‌నే వివిర‌ణ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించింది. తాను ఇంట‌ర్వ్యూకోసం ప్రాక్టీస్ చేసుకునే స‌మ‌యంలో పొర‌పాటుగా అలా జ‌రిగింద‌ని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది మార్టినెజ్. కానీ, దీనిని స్కైవెస్ట్ కంపెనీ ప‌ట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Exit mobile version