Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)
- ఆస్ట్రియన్ ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో జరిగిన ఒక భయానక ఘటన
- మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే
- పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక షాకింగ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆస్ట్రియన్ ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో జరిగిన ఒక భయానక ఘటనకు సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రశాంతంగా గాల్లో విహరిస్తున్న ఒక మహిళా పారాగ్లైడర్‌ను అకస్మాత్తుగా ఓ చిన్న విమానం ఢీకొనడంతో గాల్లోనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో పారాగ్లైడర్ పారాచూట్ పూర్తిగా చీలిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.
ఉత్తర ఆస్ట్రియాలోని ష్మిట్టెన్‌హోహే పర్వత శ్రేణి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, 44 ఏళ్ల సబ్రినా అనే మహిళ శనివారం మధ్యాహ్నం పారాగ్లైడింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా ఆమెకు అత్యంత సమీపంలో ఓ చిన్న విమానం ప్రత్యక్షమైంది. క్షణాల్లోనే ఆ విమానం పారాగ్లైడర్ రెక్కను ఢీకొట్టింది.
Also Read
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
- Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
- Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
గాల్లో అదుపుతప్పిన పారాగ్లైడర్
ఫస్ట్ పర్సన్ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోలో, విమానం వేగంగా వచ్చి పారాగ్లైడర్ పైభాగాన్ని ఢీకొట్టడం కనిపిస్తుంది. ఆ ఢీకొట్టిన ప్రభావంతో పారాగ్లైడర్ రెక్క చీలిపోవడంతో సబ్రినా గాల్లో గిరగిరా తిరుగుతూ కిందకు పడిపోవడం ప్రారంభమైంది. చిరిగిన పారాచూట్ వస్త్రాలు ఆమె చుట్టూ చిక్కుకోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది.
అయితే ఆ సమయంలో కూడా సబ్రినా ధైర్యం కోల్పోలేదు. తీవ్ర భయాందోళనల మధ్య కూడా ఆమె అప్రమత్తంగా వ్యవహరించింది. చివరి క్షణాల్లో అత్యవసర బ్యాకప్ పారాచూట్‌ను విజయవంతంగా తెరిచి తన ప్రాణాలను రక్షించుకుంది.
స్వల్ప గాయాలతో బయటపడ్డ సబ్రినా
ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ, సబ్రినాకు కేవలం స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ, “ఇప్పటికీ నేను బతికే ఉన్నానని నమ్మలేకపోతున్నాను” అని పేర్కొంది. నివేదికల ప్రకారం, కొండ వాలుపై పడిపోవడానికి క్షణాల ముందే ఆమె బ్యాకప్ పారాచూట్‌ను తెరిచింది. అనంతరం పోలీసు హెలికాప్టర్ సహాయంతో ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు.
పైలట్ వివరణ ఇదే
ఇక విమానాన్ని నడిపిన 28 ఏళ్ల పైలట్, ప్రమాదం తర్వాత విమానాన్ని జెల్ ఆమ్ సీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. విమానానికి స్వల్ప నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. పైలట్ వివరణ ప్రకారం, పారాగ్లైడర్ అకస్మాత్తుగా తన ముందుకు రావడంతో ఢీకొట్టడాన్ని తప్పించుకునే అవకాశం తనకు దొరకలేదని తెలిపాడు.
🚨 WATCH: A paraglider gets hit by a Cessna 172 near the Austrian town of Zell am See.
The paraglider was able to pull her rescue parachute and land safely shortly after the incident on Saturday.
According to police, the 44-year-old Austrian had started from Schmittenhöhe in… pic.twitter.com/HYQ7euRu57
— Breaking Aviation News & Videos (@aviationbrk) May 24, 2026
తాజావార్తలు
-
Zimbabwe Captain: సికందర్ రజా అరుదైన రికార్డు.. రోహిత్, బాబర్లను దాటేసిన జింబాబ్వే కెప్టెన్..
-
Mohan Bhagwat : మాతృశక్తిని మర్చిపోవడమే దేశ పతనానికి కారణం
-
PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
-
Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్‌కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
-
AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటన..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!