Why Alcohol Bottles Are 750 ml: తెలంగాణలో పండుగంటే చుక్కాముక్కా ఉండాల్సిందే. కొన్ని పండగలకు మటన్ ముక్కా, మద్యం చుక్కా తప్పనిసరిగా మారింది. పండుగలకు రెండ్రోలు ముందు, రెండ్రోజుల తరువాత మందు బాబులకు పండగే పండుగ. మందు చుక్క.. పార్టీ లేకుండా తెలంగాణలో పార్టీనే ఉండదు! దీంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ.. ఎప్పుడైనా లిక్కర్ ఫుల్ బాటిల్ 750 ml మాత్రమే ఎందుకు ఉంటుంది..? అనే ప్రశ్న మీలో ఉత్పన్నమైందా..? అయితే దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Hardik Pandya: బ్యాట్ సెలెక్షన్ కోసం కొడుకు సలహా తీసుకున్న స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్
వాస్తవానికి, ఫ్రెంచ్‌లో వైన్‌ను సాంప్రదాయకంగా తయారు చేసేవాళ్లు. ద్రాక్షను పండించి, పులియబెట్టి, వైన్‌గా మార్చేవాళ్లు. వీరి నుంచే ఫుల్ బాటిల్‌లో 750 మి.లీ మద్యం కాన్సెప్ట్ వచ్చిందని చెబుతారు. అది ఎలా అంటే.. ఫ్రెంచ్ వంటకాల్లో 11 భోజనాలు ఉన్నాయి. భోజనంతో పాటు ఒక వ్యక్తికి 6 పెగ్‌లు వైన్ వడ్డించే వాళ్లు. ఇలా ఇద్దరు వ్యక్తులు ఆరు పెగ్గుల చొప్పున తాగితే.. మొత్తం 12 పెగ్గులు అవుతుంది. అంటే.. 750 మి.లీ మద్యం ఇద్దరికీ సరిపోతుందని భావించారు. ఇలా అప్పుడు ప్రారంభించిన ఈ విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. అంతే కాదు.. 750 ml ఫుల్ బాటిల్ అంశానికి సంబంధించి మరికొన్ని కథనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
READ MORE: WI vs Pak: వెస్టిండీస్‌తో సిరీస్‌కు పాక్ జట్టు ప్రకటన.. బాబర్‌కు చుక్కెదురు.. అఫ్రిది రీఎంట్రీ!
భారత్‌లో ద్రవపదార్థాలను లీటర్‌లలో కొలుస్తారు. కానీ అమెరికాలో గ్యాలన్స్ లో కొలుస్తారు. 1 గ్యాలన్ అంటే 3.785 లీటర్లు. ఒక గ్యాలన్ ను పర్ఫెక్ట్ ఐదు భాగాలుగా చేస్తే 750 ఎంఎల్ సరిపోతుంది. అందుకే మద్యం బాటిల్స్ ను 750 మి.లీ గా నిర్ధారించారని మరో వాదన ఉంది. ఇదిలా ఉండగా.. వైన్ రుచిని మరింత మెరుగుపరచడానికి, ఫ్రెంచ్ తయారీ దారులు దానిని ఓక్ బారెల్స్ లేదా ట్యాంకులలో భద్రపరిచేవాళ్లు. ఈ బ్యారల్‌లలోని మద్యాన్ని సమానంగా పంచితే.. 750 మి.లీ ఫిక్స్ వస్తుంది. ఇది కూడా ఒక కారణం.
