Wedding Shoot Viral: వివాహ బంధంలో అడుగుపెడుతున్నామంటే చాలు ఆ ఆనందమే వేరు. ఫోటోలు, వీడియోలంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక వెడ్డింగ్ షూట్ చేయాలని రాష్ట్రాలు, దేశాలే దాటేస్తుంటారు. వివిధ ప్లేస్ లకు వెల్లి వెడ్డింగ్ షూటింగ్ చేస్తుంటాము కానీ ఓ జంట చేసిన వెడ్డింగ్ షూట్ చూస్తూ మాత్రం నవ్వాలో ఏడవాలో అర్థంకాదు. మరీ ఇంతగా వెడ్డింగ్ షూట్ చేయాలా అనిపిస్తుంది. వెడ్డింగ్ షూట్ అంటే ఏ పార్కులోనో, ఓమంచి రిసార్ట్ లోనో, లేక సముద్ర తీరాన అలా తీసుకుంటుంటారు. కానీ దానికి వెరైటీగా ఓ జంట చేసిన వెడ్డింగ్ షూట్ ఇప్పుడు రచ్చ చేస్తుంది. అలాంటి ఆ వెడ్డింగ్ షూట్ చేసిన వారికి ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు కానీ.. ఎక్కడ వున్నా, ఏ సమయంలోనైనా, ఎలాంటి బాధల్లో అయినా సరే నీతో నేను నాతో నువ్వు అన్నట్లుగా ఆ వెడ్డింగ్ షూట్ చేసారా? లేక చచ్చిపోయినా సరే నిన్ను నేను వదలను అంటూ ఆ వెడ్డంగ్ షూట్ చేసారా? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అయినా ఆ వెడ్డింగ్ షూట్ ఏంటనేదే కదా. మృతి చెందిన వారిని ఎక్కడ పాతి పెడ్డతాం.. ఇంకెక్కడ స్మశానంలో అంటారు అంతేకాదా. కానీ అక్కడ కూడా వెడ్డింగ్ షూట్ చేసుకోవచ్చంటున్నారు ఈ జంట. వెరైటీ వుండాలని వెడ్డింగ్ షూట్ కోసం 5 అడుగుల గోతిలో మృతి చెందినట్లు వెడ్డింగ్ షూటింగ్ చేసారు. ముందుగా ఈఫోటో చూసిన వారు అయ్యె ఇద్దరు నవ వధువుల్లా వున్నారు అప్పుడే తనువు చాలించారా అనుకున్న వారు పప్పులో కాలు వేసినట్లే.. వారు ఫోటో షూట్ లో ఓపోజు ఇచ్చారన్న మాట. అలా చనిపోయినట్లు ఆగోతిలో పడుకుని ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేశారన్నామాట. ముందు చూసిన వారందరూ ఇదేం దిక్కుమాలిన వెడ్డింగ్ షూట్ రా బాబు. మళ్లీ గోతులో పడుకుని షూటింగ్ ఏంటంటే.. మరి కొందరు నీ జీవితంలో అక్కడైనా నీతో నేనుంటా మనశ్సాంతి లేకుండా చేస్తా! అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదైతే నేం ఇప్పుడు ఈ జంట చేసిన ఈ ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెడ్డింగ్ షూట్ లో వున్న వీరిద్దరి ఏరాష్ట్రానికి చెందినవారో తెలియదు కానీ.. ఇలాంటి వెరైటీ వెడ్డింగ్ షూటింగ్ మీరు చేస్తారా? ఒక్క సారి ఆలోచించండి!
Senior Journalist Gopal Reddy: ఘాట్ రోడ్డులో ప్రమాదం.. సీనియర్ జర్నలిస్ట్ మృతి
