Enjoy Every Moment: కొంతమంది వయస్సులో ఉన్నప్పటికీ వారి ఉత్సాహం ఎప్పుడూ తగ్గదని చూపిస్తారు. శారీరక, మానసిక సామర్థ్యాలు ఏమాత్రం సడలించకపోవడంతో వయసు తమకు ఒక సంఖ్య మాత్రమేనని అంటున్నారు. రీసెంట్ ఓ వీడియోలో వృద్ధుడు సైకిల్ తొక్కుతూ చేసిన విన్యాసాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. వావ్ అంటూ ఆ వీడియో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటి కుర్రాళ్లకు పోటీగా నేను ఉన్నాను అంటూ సైకిల్ పై విన్యాసాలు చేసుకుంటూ వెళుతున్న ఈవీడియో నెటిజన్లు తెగ లైక్ లు కొడుతూ షేర్ చేస్తున్నారు. ఇప్పటివరకు 53,000 కంటే ఎక్కువ వీక్షణలను పొందింది.
Enjoy every moment ❤️ pic.twitter.com/sOujOxmEfD
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 29, 2022
ఈ వీడియోలో వృద్ధుడు సైకిల్‌పై విన్యాసాలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకున్నాడు. అయితే అక్కడినుంచి వెళెతున్న ఓ వ్యక్తి ఆ విన్యాశాలను తన ఫోన్ లో రికార్డు చేస్తుండటంతో ఆతాత ఉత్సాహం మరింతగా పెరిగింది. సైకిళ్లు ఇంకా స్పీడ్ గా నడుపుతూ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ విన్యాసాలు చేస్తూ ముందుకు సాగాడు దీంతో ఆ నెటిజన్ దాన్ని తన ఫోన్‌లో బంధించిన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా ఆ వృద్ధుడి జోష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక వినియోగదారు తనకు వయస్సు కేవలం ఒక సంఖ్య అని వ్యాఖ్యానించగా, ఒక వినియోగదారు జీవితం అందంగా ఉందని రాశారు, మరొకరు జీవితంలో ఆనందం అంటే ఇదే అని వ్యాఖ్యానించారు. “ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి, రేపటి కోసం వేచి ఉండకండి” అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.