NTV Telugu Site icon

Viral Video: బిల్లు కట్టమన్నందుకు వెయిటర్‌ను కారులో ఈడ్చికెళ్లిన కస్టమర్లు

Viralvideo

Viralvideo

కడుపు నిండా తిని.. బిల్లు చెల్లించమన్న పాపానికి ఓ వెయిటర్ పట్ల కస్టమర్లు దుర్మార్గంగా ప్రవర్తించారు. వెయిటర్‌ను కారులో కిలోమీటర్ ఈడ్చుకెళ్లారు ఈ ఘటన మహారాష్ట్రలోని ఓ హోటల్‌ దగ్గర చేటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: BJP: జార్ఖండ్‌లో బీజేపీ కీలక నిర్ణయం.. అభ్యర్థులను ఎన్నుకోనున్న కార్యకర్తలు

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని మెహకర్-పంధర్‌పూర్ పాల్ఖి రహదారిపై రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లో శనివారం ముగ్గురు వ్యక్తులు భోజనం చేసేందుకు వచ్చారు. హోటల్ బయట కారు పార్క్ చేసి భోజనం చేశారు. భోజనం చేశాక.. బిల్లు చెల్లించకుండా కారు దగ్గరకు వచ్చేశారు. యూపీఐ క్యూ ఆర్ కోడ్ స్కానర్‌ను తీసుకురావాలని వెయిటర్‌ను కోరారు. ఇంతలో వెయిటర్‌తో ముగ్గురు వాగ్వాదానికి దిగారు. అకస్మాత్తుగా కారు వెలుపల ఉన్న వ్యక్తి పారిపోయే ప్రయత్నంలో వాహనంలోకి ఎక్కేశాడు. వెంటనే కారు స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు. వారిని ఆపే ప్రయత్నంలో వెయిటర్ కారు డోర్ తెరిచాడు. ఇంకో హోటల్ ఉద్యోగి కారును వెంబడించి ఇటుక విసిరాడు. వెయిటర్‌ను కారు డోర్‌కి వేలాడుతుండగానే కిలోమీటర్ ఈడ్చుకెళ్లారు. పలువురు వెంబడించే ప్రయత్నం చేసినా ఈడ్చుకుంటూనే వెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: AP Govt: స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను రద్దు చేసిన ప్రభుత్వం

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు వెయిటర్‌ను రాత్రి బందీగా ఉంచారని పోలీసులు తెలిపారు. ఏకాంత ప్రదేశంలో కారును ఆపి వెయిటర్‌ను కొట్టి, అతని జేబులోని రూ.11,500 ఎత్తుకెళ్లారని వెల్లడించారు. కళ్లకు గంతలు కట్టి శనివారం రాత్రంతా కారులోనే ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show comments