టాలివుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ ఆహా ఓటీటీలో ఫ్యామిలీ ధమాకా అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే.. అన్‌స్టాపబుల్ విత్ NBK’షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు.. అదే విధంగా ఇప్పుడు కొత్త షో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. తాజాగా దసరా సందర్భంగా టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. యంగ్ హీరోయిన్లు చాందిని, సిమ్రాన్ చౌదరి, బిగ్‌బాస్ తేజస్వి, అనీషా, అనన్య సహా ఇంకొంతమంది సందడి చేశారు. అసలే ఓటీటీ కావడంతో షోలో డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయాడు విశ్వక్.. ఈ షో ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ప్రోమో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విశ్వక్ ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. అనీషా నా మీద కోపంగా ఉంది రెండేళ్ల నుంచి.. తను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు హోలీ రోజు సిగ్గులేకుండా వెళ్లి కలర్ కొట్టినా, వాటర్ కొట్టినా అని అలిగి వెళ్లిపోయింది.. సారీ అనీషా అంటూ విశ్వక్ అన్నాడు. ఆ ఆప్షన్స్ నాకూ ఉన్నాయా అంటూ తేజస్వి అడగడంతో విశ్వక్ కౌంటర్ వేశాడు.. దానికి తేజు నాకు ఆప్షన్స్ ఉన్నాయి అనడం తో షాక్ అయ్యాడు.. దానికి వెంటనే కౌంటర్ వేసాడు.. నువ్వు ఎప్పుడూ ప్రెగ్నంట్ అయ్యావు అన్నాడు..
తేజుకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత కూడా నువ్వు ముగ్గు ఎందుకు వేస్తావ్ తేజు.. ముగ్గులోకి దించుతావ్ కానీ అంటూ మరో సందర్భంలో కూడా పంచ్ ఇచ్చాడు విశ్వక్..ఆ తర్వాత తర్వాత సరదాగా నాకిప్పుడు నాలుగేళ్లు.. నువ్వు నా బామ్మ అంటూ తేజుతో అన్నాడు విశ్వక్. ఏమైంది నాన్న.. ఎందుకు తినడం లేదని తేజు అంటే నేను తినను.. నాకు ముద్ద వద్దు అని విశ్వక్ అంటే ఆ ముద్దు కావాలా అంటూ తేజు కూడా రెచ్చిపోయింది. ఇక చివరిలో పరేషాన్ హీరోయిన్.. సమాసా తింటావా విశ్వక్ అని అడిగింది.. నువ్వు ఉండగా అది ఎందుకు అని కౌంటర్ వేసాడు విశ్వక్.. మొత్తానికి ప్రోమో కాస్త బోల్డ్ టాక్ తో నడిచింది.. మరి ఫుల్ షో ఎలా ఉంటుందో చూడాలి..
