Site icon NTV Telugu

వైరల్ : ప్యారలల్ పార్కింగ్ కోసం మహిళ కష్టాలు… చివర్లో హిలేరియస్ ట్విస్ట్

Viral Video : Woman Struggling To Parallel Park Has A Hilarious Twist

కారును పార్క్ చేయడానికి ఓ మహిళ పడిన పాట్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువతి తన కారును మరో రెండు కార్ల మధ్య ప్యారలల్ పార్కింగ్ చేయడం కోసం నానా కష్టాలు పడింది. సుమారు గంట వరకూ ఎలాంటి పొరపాటు జరగకుండా కారును పార్క్ చేయడానికి చాలా ట్రై చేసింది. అయినా సాధ్యం కాకపోవడంతో కారులోంచి కిందకు దిగి, పార్కింగ్ ఎన్ని అడుగుల స్థలం, కారు ఎంత ఉందో తెలుసుకోవడానికి అడుగులు వేసి మరీ లెక్కించింది. పార్కింగ్ కోసం ఆమె పడుతున్న కష్టాన్ని చూసిన మరో మహిళ సాయం చేసింది. ఆమె కారు పార్క్ చేయగానే… దాని వెనకే ఉన్న తన కారును తీసుకుని వెళ్ళిపోయింది సాయం చేయడానికి ముందుకొచ్చిన మహిళ. ఈ హిలేరియస్ ట్విస్ట్ కు నెటిజన్ల నుంచి ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి.

Exit mobile version