NTV Telugu Site icon

Viral Video : పెళ్లిలో పన్నీర్ లేదని పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు.. వామ్మో ఏందయ్యా ఇది..

Paneer Fight

Paneer Fight

ఒకప్పుడు పెళ్లిలో ఏది ఉంటే అది తినేసి వెళ్ళేవాళ్లు బంధువులు.. కానీ ఇప్పుడు ఏది తక్కువైన కూడా గొడవలకు దిగితున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి.. ఇక సోషల్ మీడియాలో భయంకరంగా కొట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా మరో భయానక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

జీవితంలో ఒక్కసారే చేసుకొనే ఈ పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకుంటున్నారు.. పెళ్లికి వచ్చిన బందువులకు పది రోజులు గుర్తుండేలా రకరకాల పిండి వంటలను వడ్డీస్తారు.. నాన్ వెజ్ అయితే తాహతకు తగ్గట్లు అన్ని రకాల వంటలను పెడతారు.. అలాగే వెజ్ అయితే పుట్టగొడుగులు, లేదా పన్నీర్ లో రకరకాల వంటలను చేస్తారు.. ఆ కూరలు రుచిగా ఉండటంతో ఒక్కోసారి అయిపోతే గొడవలు కూడా జరుగుతుంటాయి.. ఈ మధ్య పన్నీరు కోసం ఎన్నో గొడవలు జరగడం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం.. ఇప్పుడు అలాంటి గొడవకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..

ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఇరు వర్గాల వారు దారుణంగా చొక్కాలు చించుకొని కొట్టుకోవడం మనం చూడవచ్చు.. కుర్చీలు విసురుకోవడం కనిపిస్తుంది. కేవలం విందులో పన్నీర్ లేదన్న కారణంతో సంతోషకరమైన క్షణాలను వీరంతా కలిసి గొడవగా మార్చేసి, ఆందోళన సృష్టించారు. ఇక ఈ క్లిప్ పై నెటిజన్లు కూడా భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. పన్నీర్ కోసం మూడో ప్రపంచ యుద్దం జరుగుతున్నట్టుందని కొందరు, మరికొందరేమో ఎంతో హ్యాపీగా ఉండాల్సిన సమయంలో ఇలా గొడవలు పెట్టుకుంటే ఆ జంట బాధపడతారుఅని కామెంట్స్ చేస్తున్నారు..