Site icon NTV Telugu

Dangerous Reporting: నెటిజన్‌ల ప్రశంసలు.. ఇలాంటి రిపోర్టింగ్ మీరెప్పుడైనా చూశారా?

Pakistan Reporter

Pakistan Reporter

Viral Video Of Live Reporting: మీడియా రంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా రంగంలో చాలా మంది జర్నలిస్టులు ఎన్నో సందర్భాల్లో సాహసాలు సైతం చేస్తుంటారు. తాజాగా పాకిస్తాన్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వరదనీటిలో చిక్కుకున్నాయి. రోడ్లు, రైలు మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆకలితో అలమటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని కవర్ చేసేందుకు వెళ్లిన ఓ పాకిస్తానీ జర్నలిస్ట్ పీకల్లోతు నీటిలో వరదలో నిలబడి మరీ లైవ్ కవరేజ్ ఇచ్చాడు. వరదలో కొట్టుకుపోతుండగా అతనితో పాటు కెమెరామెన్ వీడియో తీస్తూ అనుసరించాడు. ఆ ప్రాంత పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు సదరు రిపోర్టర్ ప్రాణాలకు తెగించి తన వంతు కృషి చేశాడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి రిపోర్టింగ్ గతంలో ఎప్పుడూ చూడలేదంటూ కొనియాడుతున్నారు. అయితే సదరు జర్నలిస్టు డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అని కొందరు నెటిజన్‌లు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం టీఆర్పీ కోసం మీడియా సంస్థలు జర్నలిస్టుల చేత ఇలాంటి రిపోర్టింగ్ చేయించడం సబబు కాదని మండిపడుతున్నారు.

Exit mobile version