Site icon NTV Telugu

Viral Video: కనకవర్షం కురిపించిన ఏటీఎం.. షాకింగ్‌ వీడియో..

Uk Atm Video

Uk Atm Video

లండన్‌లోని ఓ ఏటీఎం కనకవర్షం కురిపించింది. డ్రా చేసిన అమౌంట్‌ కంటే డబుల్‌ మనీ ఇచ్చింది. దీంతో జనం ఆ ఏటీఎం ముందు బారులు తీరిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకి అసలు సంగతి ఏంటంటే.. డబ్బులు కావాలంటే ఒకప్పుడు బ్యాంకుల్లో గంటలు గంటలు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఏటీఎం మెషిన్స్‌ వచ్చాక ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడు డబ్బు కావాలంటే అప్పుడు మనీ విత్‌డ్రా చేసుకోవచ్చు. దీంతో ఏటీఎం మెషిన్స్‌ తీసుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు వచ్చే సాంకేతిక సమస్యల వల్ల డబ్బు అందులో ఇరుక్కుపోవడం, లేదా ఇతరుల స్కాం చేసి ఇతర అకౌంట్ల నుంచి డబ్బుల తీసుకునే అవకాశం ఉంది. అలాంటి సాంకేతిక లోపం వల్ల ఏటీఎంకు వచ్చిన కొందరు ఫుల్‌ ఖుష్‌ అయ్యారు.

Also Read: Amitabh Bachchan: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు రావోద్దని ఫ్యాన్స్‌ వార్నింగ్‌.. అమితాబ్‌ రియాక్షన్‌ చూశారా!

లండన్‌లోని ఈస్ట్ హ్యామ్ హై స్ట్రీట్‌లోని ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాని కారణంగా కస్టమర్ ఎంటర్ చేసిన దానితో పోలిస్తే రెండింతలు ఎక్కువ డబ్బు ఇవ్వడం ప్రారంభించింది. విషయం తెలిసి జనాలు ఏటీఎంకు క్యూ కట్టారు. చూస్తుండగా ఏటీఎం జనాలతో కిటకిటలాడిపోయింది. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో క్షణాల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. 9 సెకడ్ల ఈ వీడియో కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ సంపాదించుకుంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. కొందరు అదృష్టవంతులు అంటూ కామెంట్స్‌ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ‘కక్కుర్తి పడకండి.. అసలు విషయం తెలిశాక బ్యాంక్‌ వాల్లు రికవరి చేస్తారు. అప్పుడు మీ అకౌంట్‌ ఖాళీ అవుతుంది జాగ్రత్త’ అంటూ హెచ్చరిస్తున్నారు.

Also Read: Navdeep: పెళ్లి పీటలు ఎక్కుతున్న మరో యంగ్ హీరో.. ?

Exit mobile version