ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఫన్నీవీడియోలు వైరల్ అవుతాయి.. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో ఒక యుకుడు హాస్పిటల్ లో ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ.. రీల్ చేస్తున్నాడు. అలా చేస్తుండగా.. అతడిని ఓ డాక్టర్ మందలించాడు. తర్వాత అతడికి రీల్స్ చేయడంతో వచ్చే ఆదాయం గురించి తెలుసుకున్న డాక్టర్ కూడా అతనితో డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
Read Also: Couple Theft Cars:కార్ల చోరీకి పాల్పడిన యువతీ..యువకుడు.. మహిళ అరెస్ట్..
అయితే.. యువకుడు చేసిన పనికి డాక్టర్ అతన్ని మందలించాడు. డాక్టర్ ని చూసి భయపడిపోయన యువకుడు..క్షమాపణలు చెప్పాడు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేస్తారు.. కానీ ఇలా నీలా రీల్స్ చేయరంటూ కాస్త గట్టిగా మందలించాడు. కానీ కొద్ది సేపటికే .. అక్కడ సీన్ మారిపోయింది.. ఇది చూసిన నెటిజన్లు కంగుతిన్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఆస్పత్రిలో రీల్స్ ఎందుకు చేశాడో డాక్టర్ కు క్లియర్ గా ఎక్స్ప్లేన్ చేశాడా యువకుడు. రీల్స్ ద్వారా 7 నుండి 8 లక్షల రూపాయల వరకు సంపాదిస్తానని చెప్పడంతో.. డాక్టర్ షాకయ్యాడు.. ఆ తర్వాత డాక్టర్ , యువకుడు ఇద్దరూ కలిసి రీల్స్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.
