దేశంలో పెద్ద నోట్లు రద్దయి ఏడేళ్లు దాటింది. ఈ నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదయ్యాయి. వాటిపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. డిమానిటైజేషన్‌ను సమర్థించింది. నోట్ల రద్దు తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉంది. కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. కొత్త రూ.500, రూ.2000 నోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన ఓ టీవీ న్యూస్ ఛానెల్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ఎక్స్ వినియోగదారులు ఈ వీడియోను తమ ఖాతాల్లో షేర్ చేసుకున్నారు. పీఎం మోడీ యొక్క ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. “కొత్త 500, 2000 నోట్లు వస్తున్నాయి.” అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. కొందరు మళ్లీ నోట్లు రద్దవుతాయని భయాందోళనకు గురవుతున్నారు.
READ MORE: Sandhya Theatre: సంధ్య థియేటర్లో మరణించిన రేవతి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం.. ఎంతంటే?
వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
ఈ వైరల్ వీడియోపై ఓ జాతీయ మీడియా సంస్థ దర్యాప్తు చేసింది. అందులో ఈ వీడియో పాతదని తేలింది. 8 నవంబర్ 2016 నాటి ఎకనామిక్ టైమ్స్ యొక్క ఎక్స్ పోస్టుగా గుర్తించారు. దేశంలో 8 నవంబర్ 2016న పెద్ద నోట్ల రద్దు జరిగిన విషయం తెలిసిందే. గూగుల్‌లో దీనికి సంబంధించిన వీడియో కోసం సర్చ్ చేయగా.. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో కనిపించింది. ఎనిమిదేళ్ల క్రితం నాటి పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి దేశంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లను విడుదల చేస్తామని ప్రధాని మోడీ ఈ వీడియోలో ప్రకటించారు. అప్పట్లో అన్ని మీడియా సంస్థలు ఈ వీడియోను తమ ఛానెల్స్‌లో ప్లే చేశాయి. ఈ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
New ₹500 & ₹2000 Note coming soon 👍 pic.twitter.com/jrUvhGbfFN
— prakash kodnany (@kodnany_prakash) December 18, 2024