Site icon NTV Telugu

Viral News: ఇవెక్కడి వింత చట్టాలురా బాబు..?

Strange Laws In Overseas

Strange Laws In Overseas

పురాతన సమాజాల్లో ప్రజలు ఎలా జీవించాలి? ఎలాంటి పనులు చేసుకోవాలి? ఒకరితో మరొకరు ఎలా మెలగాలి? అనే విషయాలపై నాయకులు నియమాల్ని రూపొందించి చట్టాలు రాశారు. ప్రతీ దేశం తమ శాంతి భద్రతల్ని కాపాడుకోవడానికి, అలాగే పరిపాలన సౌలభ్యం కోసం.. పాత చట్టాల్ని సవరించుకోవడంతో పాటు కొత్త చట్టాల్ని ప్రవేశపెడుతుంటుంది. ఆ చట్టాలకి అనుగుణంగా దేశ పౌరులు నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే.. కొన్ని దేశాలు మాత్రం వింతవైనవి, విచిత్రమైనవి చట్టాల్ని తీసుకొచ్చాయి. వాటిని గురించి తెలిస్తే.. అసలెందుకు ఇలాంటి చట్టాల్ని తీసుకొచ్చారని సందేహం కలగన మానదు. అవేంటంటే..

* ఇంగ్లండ్‌లోని మసాచుసెట్స్‌లో నిద్రపోవడానికి ముందు స్నానం చేయాలి. లేకపోతే జైల్లో పెడతారు.
* అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిక్సో జనాలు తమ లోదుస్తులతో కార్లను శుభ్రం చేయకూడదు. ఎవరైనా అలా చేస్తే భారీ జరిమానా విధిస్తారు.
* స్విట్జర్లాండ్‌లో రాత్రి 10 గంటల తర్వాత బాత్రూంలో ఫ్లష్ చేయకూడదు. ఇది అక్కడ నిషేధించబడింది. ఒకవేళ ఫ్లష్ చేస్తే, జరిమానా తప్పదు.
* ఇటలీలోని మిలన్ నగరంలో ‘నవ్వు’ను నిషేధించారు. ఇక్కడ ఎవరైనా నవ్వుతూ కనిపిస్తే, జరిమానా విధిస్తారు.
* బ్రూనైలో స్వలింగ సంప్కరం అనేది చట్టవిరుద్ధం. ఎవరైనా దోషులుగా తేలితే, వాళ్లను రాళ్లతో కొట్టి చంపేస్తారు.

ఇవే ఆ వింత చట్టాలు. ఆయా దేశ పౌరులు ఈ చట్టాల్ని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. కాదు, కూడదంటూ వాటిని ఉల్లంఘిస్తే మాత్రం.. అంతే సంగతులు. తొలి నాలుగు చట్టాలు కాస్త నవ్వు తెప్పించే విధంగా ఉన్నా.. ఐదోవది మాత్రం చాలా తీవ్రమైంది. పాపం.. బ్రూనైలో ఉన్న స్వలింగ సంపర్కుల పరిస్థితి ఎంత దయనీయమైందో?

Exit mobile version