Site icon NTV Telugu

Starlinks: భూమిపై కూలిపోయిన స్పేస్ ఎక్స్ ఉప‌గ్ర‌హాలు…

దేశంలోని మారుమూల ప్రాంతాల‌కు కూడా హైస్పీడ్ ఇంట‌ర్నెట్‌ను అందించాల‌నే ఉద్దేశంతో ఎల‌న్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్‌లింక్ పేరుతో ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌యోగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ స్టార్‌లింక్స్ ఉప‌గ్ర‌హాలు ఒక‌దానితో మ‌రోక‌టి ఇంట‌ర్‌లింక్ అయ్యి ఉంటాయి. ఇటీవ‌లే 49 స్టార్ లింక్స్ ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌యోగించింది స్పేస్ ఎక్స్ సంస్థ‌. ప్ర‌యోగించిన 49 స్టార్‌లింక్స్ ఉప‌గ్ర‌హాల్లో 40 దారిత‌ప్పాయి. ఇందులో కొన్ని ఉప‌గ్ర‌హాలు భూవాతావ‌ర‌ణంలోకి ప్ర‌వేశించి భూమిపై కూలిపోయాయి.

Read: Covid 19: ఆ వ్య‌క్తిని వ‌ద‌ల‌ని క‌రోనా…78 సార్లు పాజిటివ్‌…

సూర్యుని నుంచి సౌర‌తుఫాన్ ప్ర‌మాదం పొంచి ఉందని, ఈ సౌర‌తుఫాన్ కార‌ణంగా ఉప‌గ్ర‌హాల‌కు ఇబ్బందులు వ‌స్తాయ‌ని యూఎస్ వాతావ‌ర‌ణ‌శాఖ ముందుగానే హెచ్చ‌రించింది. ఇక కూలిపోయి స్టార్‌లింక్స్ ఉప‌గ్ర‌హాల దృశ్యాల‌ను ప్యూర్టోరికోకు చెందిన ఆస్ట్రోనోమియా డెల్ కెర్బి అనే సంస్థ చిత్రీక‌రించింది. దీనికి సంబందించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.

Exit mobile version