Site icon NTV Telugu

Underwater Wedding: సాహసోపేత వివాహం.. ఏకంగా సముద్రం అడుగున జంట పెళ్లి..

Underwater Wedding

Underwater Wedding

ప్రజలు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం సముద్ర తీరం, పర్వతాలు లేదా రాజ కోట మొదలైన వాటికి వెళతారు. చాలా మంది సెలబ్రిటీలు విదేశాలకు వెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్‌లు చేసుకుంటారు. తద్వారా వారు భిన్నమైన అనుభవాన్ని పొందుతుంటారు. అయితే సౌదీ అరేబియాకు చెందిన ఓ జంట మాత్రం ఇందుకు భిన్నంగా పెళ్లిళ్లలో సరికొత్త ట్రెండ్‌ను ప్రవేశపెట్టింది. నిజానికి ఈ జంట పెళ్లి సముద్రం ఒడ్డున కాకుండా సముద్రంలోనే జరిగింది. అవును.. ఈ జంట నీటి అడుగున వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. హసన్ అబు అల్-ఓలా, యాస్మిన్ దఫ్తాదార్ అనే జంట ఎర్ర సముద్రంలో వివాహం చేసుకుంది. ఎర్ర సముద్రం ఆసియా, ఆఫ్రికా మధ్య హిందూ మహాసముద్రానికి సముద్ర ద్వారం అని కూడా పిలుస్తారు.

READ MORE: Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో అధికారం బీజేపీ కూటమిదే.. ఆర్ఎస్ఎస్ సర్వేలో వెల్లడి..

కొంతమంది తోటి డైవర్లు ఈ ప్రత్యేకమైన సాహసంలో పాల్గొన్నారు. దీనిని స్థానిక డైవింగ్ బృందం నిర్వహించింది. దాని నివేదిక గల్ఫ్ న్యూస్‌లో కూడా ప్రచురించబడింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. నీటి అడుగున వివాహం జరగబోతోందనే విషయం ఆ జంటకు కూడా తెలియదు. సౌదీ డైవర్స్‌కు చెందిన కెప్టెన్ ఫైసల్ వారి పెళ్లిని సముద్రం కింద జరుపుకోవాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు. సముద్రంలో డైవ్ చేయడానికి కావాల్సిన ప్రాథమిక వస్తువులను ఈ జంటకు డైవర్ల టీమ్ అందించింది. ఈ ప్రత్యేక రోజు కోసం.. వధువు తెల్లటి గౌను ధరించింది. వరుడు నల్లటి టక్సేడోలో కనిపించారు. ఇద్దరూ అవసరమైన డైవింగ్ గేర్ కూడా ధరించారు. తన వివాహం గురించి పెళ్లి కొడుకు హసన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఎలాంటి సమస్యలు లేకుండా ఈ కార్యక్రమం చాలా సజావుగా జరిగింది. ఇది ఎంతో అసాధారణమైన, అద్భుతమైన విషయం అని అందరూ ఆశ్చర్యపోయారు” అని అన్నారు.

READ MORE:Singareni: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..

Exit mobile version