Twist : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ జిల్లా అస్మోలి ప్రాంతంలో సోషల్ మీడియా ద్వారా అసభ్యతను ప్రోత్సహించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహక్, పరిలు అనే ఇద్దరు యువతులు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, వారి ఇద్దరు సహచరులతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యంగా, అశ్లీలతతో కూడిన వీడియోలు పోస్ట్ చేస్తున్నారని పోలీసులకు స్థానికుల నుంచి వరుస ఫిర్యాదులు అందాయి. వీరిని సంభల్ పోలీసులు అరెస్ట్ చేసి, జైల్లోకి తరలించారు.
సోషల్ మీడియా వేదికగా నిర్వహిస్తున్న ‘మహక్ పరిచ 143’ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ నలుగురు యువతులు అసభ్య కంటెంట్‌ను పంచుకుంటూ, సామాజిక మర్యాదలకు విరుద్ధంగా ప్రవర్తించారని జిల్లా ఎస్పీ కృష్ణ బిష్ణోయ్ తెలిపారు. వీరి వీడియోలు సంభల్ జిల్లా పేరు చెడేలా చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
Andhra Pradesh: మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లుగా ఇతర శాఖల ఉద్యోగులు.. కీలక ఉత్తర్వులు..
స్థానిక ప్రజలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్ 67, అలాగే భారతీయ న్యాయవ్యవస్థలో కొత్తగా అమలులోకి వచ్చిన BNS చట్టంలోని 294B సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ యువతులు ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యపదజాలంతో కూడిన వీడియోలు పోస్ట్ చేస్తూ యువతపై చెడు ప్రభావం చూపిస్తున్నారని పోలీసుల అభిప్రాయం.
మహక్, పరిలు ఇప్పటివరకు 546 వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. వీరి ఫాలోవర్ల సంఖ్య 4 లక్షలకుపైగా ఉందన్నది ఆశ్చర్యకరమైన అంశం. ఇలాంటి వీడియోల ద్వారా సోషల్ మీడియాలో సులభంగా పాపులారిటీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే వారు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని పోలీసుల అనుమానం. ప్రస్తుతం వారి అకౌంట్లను పోలీసులు బిగ్గరగా పరిశీలిస్తున్నారు.
ఈ కేసుపై స్పందించిన ఎస్పీ బిష్ణోయ్, “సామాజికంగా అసభ్యతను ప్రోత్సహించే వారిని క్షమించం. ఇలాంటి వీడియోల ద్వారా సమాజంలో చెడు సంకేతాలు వెళ్తున్నాయి. ఇకపై ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై మేము కఠినంగా వ్యవహరిస్తాం” అని హెచ్చరించారు.
