Site icon NTV Telugu

Snake Vs Mongoose: పాము-ముంగిస మధ్య భీకర యుద్ధం.. చివరికి ఏమైందంటే..!

Snake Vs Mongoose

Snake Vs Mongoose

సోషల్ మీడియాతో తరచూ ఏదోక ఆసక్తికర సంఘటన బయటకు వస్తుంది. ప్రపంచ నలుమూలలో ఏం జరిగినా అది వెంటనే సోషల్ మీడియాకు ఎక్కుతుంది. తాజాగా నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ వీడియో బయటకు వచ్చింది. కాగా ముంగిస, పాము శత్రుత్వం అందరికీ తెలిసిందే. ఈ రెండు ఎదురుపడితే అంతే ఇంకా. అక్కడ భీకర యుద్దమే మొదలవుతుంది. నువ్వా-నేనా అన్నట్టుగా పోరాడుతాయి. చివరికి ఈ పోరులో ముంగిసే గెలుస్తుందని చెబుతుంటారు. అదే నిజమని మరోసారి ఈ వీడియో ప్రూవ్ చేసింది. ముంగిస, పాము మధ్య ఇలాంటి భీకర పోరుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Also Read: Sim Card New Rules: నకిలీ సిమ్ కొంటే 3 ఏళ్ల జైలు, 50 లక్షల జరిమానా.. సిమ్ కి సంబంధించిన ఈ 3 కొత్త రూల్స్ తెలుసా?

ఈ వీడియోలో పాము రోడ్డు పక్కన విశ్రాంతి తీసుకుంది. అదే సమయంలో మరోవైపు పొదల నుంచి వచ్చిన ముంగిస పామును చూసింది. ఇంకేముందు దాన్ని చూడగాని పాము దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చింది. పాముపై దాడికి చేసేందుకు సై అయ్యింది. ముంగిసను చూసిన పాము తప్పించుకునేందుకు యత్నించినా అది సాధ్యపడలేదు. ముంగిస దాడి చేస్తుంటే పాము ఎదురు దాడి చేసింది. దాని నుంచి తప్పించుకున్న ముంగిస పాము చూట్టూ తిరుగుతూ చిక్కినప్పుడల్లా దాడి చేసింది. చివరికి పాము తలను నోట పట్టుకుని పొదల్లోకి ఈడ్చుకెళ్లింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. కొందరు పాముపై సానుభూతి చూపిస్తుంటే.. మరికొందరు ముంగిసను హీరో అంటూ పొగుడుతున్నారు. కాగా నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్.. వేలల్లో లైక్స్ వచ్చాయి.

Exit mobile version