Site icon NTV Telugu

Viral News: నిద్రలో ఆ పని చేస్తున్నాననుకొని మర్మాంగాన్ని కత్తితో కోసి..

Meet

Meet

Viral News: నిద్రలో ఒక కల వచ్చింది.. అది మంచిది అయితే అలాగే ఆస్వాదిస్తాం.. అదే చెడ్డది అయితే ఉలిక్కిపడి లేస్తాం. అది సహజమే. ఎందుకంటే మెదడు లో ఉండే కొన్ని హార్మోన్స్ మనల్ని వార్న్ చేస్తూ ఉంటాయి. అయితే ఇందులో కొన్ని వ్యాధులు ఉన్నవారికి మాత్రం ఇలాంటివి తెలియవు. ముఖ్యంగా నిద్రలో నడిచేవారికి, నిద్రలో ఉండి ఏం చేస్తున్నారో తెలియనివారికి అలాంటి హార్మోన్స్ తక్కువ పనిచేస్తాయని వైద్యులు తెలుపుతున్నారు. ఇక తాజాగా ఒక వ్యక్తి నిద్రలో మాంసం కోస్తున్నాను అనుకోని తాని ప్రైవేట్ పార్ట్ ను కట్ చేసుకున్నాడు. ఈ ఘటన సౌత్ ఆఫ్రికాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. సౌత్ ఆఫ్రికా, ఘనాలో ఒక 42 ఏళ్ల వ్యక్తి నివసిస్తున్నాడు. అతడికి నిద్రలో లేచే అలవాటు లేదు.. ఏమి లేదు. అయితే ఒక రోజు రాత్రి అతడు గాఢ నిద్రలో ఉన్నాడు. అతడికి కలలో మాంసం కట్ చేస్తున్నట్లు అనిపించింది. అంతే ఏం చేస్తున్నాడో, తన చేతుల్లో ఏం ఉందో తెలియదు.. అదే ఊహలో ఉండి మాంసాన్ని కట్ చేస్తున్నాను అనుకోని తన మర్మాంగాన్ని కట్ చేసుకున్నాడు. అలా చేస్తున్నా అతనికి మెలుకువ రాకపోవడం విశేషం. ఆ నొప్పి భరించలేకుండా రక్తం కారుతుండడంతో కొద్దిసేపు తరువాత అతడికి స్పృహ వచ్చింది. ఇక వెంటనే అరుపులు కేకలతో ఆ రూమ్ దద్దరిల్లిపోయింది. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాదాపు ఆరువారాలు శ్రమించిన వైద్యులు అతని మర్మాంగాన్ని తిరిగి అతికించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని విచారించగా.. నాకు కలలో మీట్ కట్ చేస్తున్నట్లు అనిపించింది.. ఆ సమయంలో నా చేతిలోకి కత్తి ఎలా వచ్చిందో తెలియదు.. అని చెప్పుకురావడం విశేషం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version