NTV Telugu Site icon

ప్ర‌పంచంలోని ఈ దేశాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా అడుగుపెట్ట‌లేద‌ట‌…

2020 నుంచి ప్ర‌పంచ దేశాల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి ప‌ట్టిపీడిస్తున్న‌ది. క‌రోనా కార‌ణంగా ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ఆర్థిక‌రంగం కుదేలైన సంగ‌తి తెలిసిందే. కరోనా నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూల, నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారు. ప్ర‌పంచ‌లోని దాదాపు ప్ర‌తీ దేశంలోనూ క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌వేశించింది. కానీ, ఈ ఆరు దేశాల్లోకి మాత్రం క‌రోనా ఎంట‌ర్ కాలేక‌పోయింది. అక్క‌డ ఎలాంటి లాక్‌డౌన్‌లు అమ‌లు చేయ‌డం లేదు. ముంద‌స్తుగా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఆ దేశాలో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Read: ఒమిక్రాన్ ఎఫెక్ట్‌: అత్య‌ధిక‌మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌లు ఇవే…

మ‌ధ్య ఆసియా దేశాల్లో ఒక‌టైన తుర్కుమోనిస్తాన్‌లో ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదుకాలేదు. ఒక‌వైపు కాస్పియ‌న్ స‌ముద్రం, మ‌రోవైపు ఎడారి స‌రిహ‌ద్దు క‌లిగిన ఈ దేశం మొద‌టి నుంచి వ్యూహాత్మ‌కంగా క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకున్న‌ది. విదేశాల నుంచి స్వ‌దేశం వ‌చ్చే వారు త‌ప్ప‌ని స‌రిగా నెగెటివ్ స‌ర్టిఫికెట్ తీసుకోవాలి, అంతేకాదు, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే స్వ‌దేశంలోకి అనుమ‌తి ఉంటుంది. 18 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌ని స‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇక ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలోని ద్వీప‌మైన కుక్ ఐలాండ్‌లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేదు. ఈ ఐలాండ్ జ‌నాభా మొత్తం 17 వేలు. ఉత్త‌ర కొరియాలోనూ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క క‌రోనా కేసు కూడా నమోద‌వ్వ‌లేద‌ని ఆ దేశం ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ కూడా ధృవీక‌రించిన సంగ‌తి తెలిసిందే. టెక్‌లావ్‌, నౌరు, తువాలు వంటి దేశాల్లో కూడా క‌రోనా కేసులు న‌మోద‌వ్వ‌లేదు.