NTV Telugu Site icon

Guess The Actress : ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఇలా మారిపోయిందేంటి?

Richaaa

Richaaa

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బాగా బిజీ ఉన్న హీరోయిన్లు ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయారు.. కొందరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే మరికొందరు మాత్రం అస్సలు కనిపించలేదు.. ఆ లిస్ట్ లో తెలుగు హీరోయిన్లే కాదు బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు.. ఆ లిస్ట్ లో ఓ హీరోయిన్ ఉంది.. ఆ హీరోయిన్ ఒకప్పుడు యువతను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియలేదు.. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు కదా.. ఆమె ఎవరో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

అందం, టాలెంట్ ఉన్నా సరైన గైడెన్స్ లేక కెరీర్‌ను సరిగా ప్లాన్ చేసుకోలేక కనుమరుగైపోతుంటారు. అలాంటి ఓ హీరోయిన్‌యే రిచా పల్లోడ్. ఈ పేరు చెబితే పెద్గగా స్ట్రైక్ అవ్వకపోవచ్చు.. కానీ తరుణ్ నువ్వే కావాలి హీరోయిన్ అంటే అందరికీ గుర్తుకు వస్తుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్స్ అవ్వడం వల్ల సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికి సినిమా వస్తే టీవీ లకు అతుక్కపోతున్నారు. ఆ తర్వాత హోలీ, చిరుజల్లు, ప్రేమతో రా, నా మనసిస్తా రా, పెళ్లాం పిచ్చోడు, ఇంకోసారి ఇలా ఎన్నో చిత్రాల్లో రిచాకు ఛాన్సులు వచ్చాయి. కానీ నువ్వే కావాలి లాంటి సక్సెస్ మాత్రం ఈమెకి దక్కలేదు..

కన్నడ బ్యూటీ రిచా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేసింది. కానీ సరైన హిట్లు పడకపోవడంతో 2011లో హిమాన్షు బజాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు మాత్రమే ఉన్నాడు.. ఆ తర్వాత మెల్లగా ఇండస్ట్రీకి దూరం అయ్యింది.. ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఓ లుక్ వేసుకోండి..

View this post on Instagram

 

A post shared by Richa Pallod (@richapallod)