NTV Telugu Site icon

ఈ విస్కీ చాలా కాస్ట్‌లీ…!!

దేశం ఏదైనా స‌రై అక్క‌డి ప్ర‌భుత్వాల‌కు మంచి ఆదాయం తీసుకొచ్చే శాఖ‌ల్లో ఎక్సైజ్ శాఖ ఒక‌టి.  ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా మ‌ద్యం అమ్మకాల్లో త‌గ్గుద‌ల క‌నిపించ‌దు.  బ్రాండ్‌ల‌ను బ‌ట్టి మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రుగుతుంటాయి.  దేశీయంగా ల‌భించే మ‌ద్యం ధ‌ర త‌క్కువ‌గా ఉంటే, విదేశాలలో త‌యారయ్యే మ‌ద్యానికి ధ‌ర అధికంగా ఉంటుంది.   ఇక జ‌పాన్‌లో త‌యార‌య్యే య‌మ‌జాకీ 55 అనే విస్కీ బాటిల్ ఖ‌రీదు ఎంతో తెలిస్తే నిజంగా షాక్ అవుతాం.  ఈ విస్కీ బాటిల్ ధ‌ర రూ. 4.14 కోట్లు.  ఈ ర‌కం విస్కీని ప్ర‌పంచంలోని వివిధ విమానాశ్ర‌యాల్లోని మ‌ద్యం దుకాణాల్లో వేలానికి పెట్టారు.  ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో చైనాకు చెందిన ఓ వ్య‌క్తి దీనిని సొంతం చేసుకున్నాడు.  చాలా అరుదుగా య‌మ‌జాకీ విస్కీ బాటిళ్లు జ‌పాన్ కంపెనీ త‌యారు చేస్తుంద‌ట‌.  అత్యంత ఖ‌రీదైన మ‌ద్యం జాబితాలో య‌మ‌జాకీ 55 విస్కీ కూడా చేరిపోయింది.

Read: స్కూళ్లకు సెలవులు పొడిగించాల్సిందే.. నారా లోకేష్ డిమాండ్